అతనే జట్టును వదిలేశాడు, పంత్ పై ఢిల్లీ ఓనర్ కామెంట్స్
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి అందరి దృష్టీ రిషబ్ పంత్ పైనే నిలిచింది. దానికి తగ్గట్టుగానే వేలంలో ఈ యువ స్టార్ ప్లేయర్ భారీ ధర పలికాడు. సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ ఏకంగా 27 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి అందరి దృష్టీ రిషబ్ పంత్ పైనే నిలిచింది. దానికి తగ్గట్టుగానే వేలంలో ఈ యువ స్టార్ ప్లేయర్ భారీ ధర పలికాడు. సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ ఏకంగా 27 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించాడు. అయితే పంత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ ను ఢిల్లీ ఎందుకు వదిలేసుకుందనేది చాలా మంది వేధిస్తున్న ప్రశ్న… యాజమాన్యంతో విభేదాలు రావడంతోనే పంత్ ఆ జట్టును వీడాడని అందరికీ అర్థమైంది. డబ్బు కోసం కాకుండా ఇతర విషయాల్లో ఢిల్లీ ఓనర్స్ తో పంత్ కు అభిప్రాయబేధాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. తాజాగా పంత్ తో గొడవపై ఢిల్లీ ఫ్రాంచైజీ కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. పంత్ విషయంలో యాజమాన్యం తప్పేమీ లేదన్నారు. పంత్ తనకు తానుగా జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ పంత్ నుంచి ఫ్రాంఛైజీ ఆశించిన మేర ప్రదర్శన రాలేదనీ, కెప్టెన్‌గా జట్టును సరిగ్గా నడిపించలేకపోయాడనీ చెప్పాడు. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ నిజాయితీగా అతనికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చిందన్నాడు. అయితే ఆ ఫీడ్‌బ్యాక్‌ను పంత్ చాలా ఎమోషనల్‌గా తీసుకుని జట్టు నుంచి బయటకు వచ్చేశాడని పార్థ్ జిందాల్ అసలు విషయం చెప్పాడు. రిషబ్ పంత్‌ను వేలానికి వదిలేయకుండా.. రిటెన్ చేసుకోవడం గురించి అతనితో చాలా సార్లు చర్చలు జరిపామని కూడా వెల్లడించాడు. కానీ అప్పటికే రిషబ్ పంత్ ఢిల్లీ ప్రాంఛైజీని వీడాలని నిర్ణయం తీసుకున్నాడనీ తెలిపాడు.
అయినప్పటికీ పలు సార్లు ఢిల్లీ ఫ్రాంచైజీ కో-ఓనర్‌లలో ఒకరైన కిరణ్ కుమార్ గ్రంధి చాలా ప్రయత్నించారని గుర్తు చేసుకున్నాడు. అప్పటికే ఆలస్యమైపోవడంతో వదులుకోక తప్పలేదన్నాడు. కాగా మెగా వేలంలో రిషబ్ పంత్ కోసం బిడ్ వేయకూడదని తొలుత నిర్ణయించుకున్నామని.. కానీ టీమ్‌తో అతనికి ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుని ఆఖర్లో ఆర్టీఎం కార్డుని వాడినట్లు పార్థ్ జిందాల్ వెల్లడించారు. కానీ.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం పంత్ ధరను భారీగా పెంచేసిందనీ, దీంతో తాము వెనక్కి తగ్గత తప్పలేదని పార్థ్ జిందాల్ వెల్లడించారు.