Film Producer, Bandla Ganesh : నాకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు.. (బండ్ల గణేష్)
ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని.. కానీ తాను మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎంతగానో సహకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

He said that Rahul Gandhi is ready to give him a ticket in this election, but he is not ready to contest He thanked TPCC Chief Revanth Reddy for helping him so much in this matter
రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ధీటుగా తమ అభ్యర్థులను దింపేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కూకట్‌పల్లి నుంచి బండ్ల గణేష్‌ను దించబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారు అని అంతా అనుకుంటున్న టైంలో.. బండ్ల అందరికీ షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనంటూ చెప్పారు. గత ఎన్నికల్లో తాను కాంగ్రెస్ కోసం ప్రచారం చేశానని.. ఇప్పుడు కూడా పార్టీ గెలుపు కోసం పని చేస్తానంటూ చెప్పారు.
గణేష్ కు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న రాహుల్..!
ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని.. కానీ తాను మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎంతగానో సహకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కోసం పని చేసేందుకు తామంతా రెడీగా ఉన్నామన్నారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కోసం తాను కష్టపడతానంటూ చెప్పారు. రాజకీయాల్లో తనకు అండగా ఉన్న, ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో కొన్ని రోజులగా కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది.
ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగి ధీటుగా అదే సామాజిక వర్గానికి చెందని వ్యక్తి కోసం వెతికింది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పేరు తెరపైకి వచ్చింది. ఇదే విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ బండ్ల గణేష్‌తో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో ఇక కూకట్‌పల్లికి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బండ్ల షాకిచ్చారు. ఇక ఆయన స్థానంలో కూకట్‌పల్లి టికెట్ ఎవరికి కేటాయిస్తారో చూడాలి.