Heat Waves In AP-TS: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాలకు వడగాల్పుల ముప్పు

తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2024 | 08:54 PMLast Updated on: Apr 28, 2024 | 8:54 PM

Heat Waves In Ap And Ts Imd Issued Orange Alert

Heat Waves In AP-TS: ఏపీ, తెలంగాణలో ఎండలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. దీంతో జనం ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. ఆదివారం సూర్యాపేట జిల్లాలో వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Drugs Seized: పాక్ డ్రగ్స్ రాకెట్ ముఠా అరెస్ట్.. 600 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్‌ కర్నూల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్‌, నల్గొండ, మహబూబాబాద్‌, సూర్యాపేట, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, ములుగు, జోగులాంబ గద్వాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆ‍యా జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణలో వేడి, తేమ వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.

ఏపీకి సంబంధించి సోమవారం 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మంగళవారం 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 159 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు.. వడదెబ్బ తగలకుండా గొడుగు, టోపీ, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు.