హైదరాబాద్ బీఅలెర్ట్, అస్సలు బయటకు రావొద్దు…!
హైదరాబాద్ ప్రజలకు వర్షం చుక్కలు చూపిస్తోంది. రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాత్రి నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది.

హైదరాబాద్ ప్రజలకు వర్షం చుక్కలు చూపిస్తోంది. రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాత్రి నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఇప్పుడు మళ్ళీ వాతావరణ శాఖ హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాగల గంటపాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్ష సూచన చేసారు.
దీనితో జీహెచ్ఎంసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బల్దియా ప్రజలను హెచ్చరించింది. ఇక ఇప్పటికే భారీ వర్షంతో పరిస్థితి దారుణంగా మారింది. మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన చేసారు. అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దు అంటూ అధికారులు హెచ్చరించారు.