Nagar-Kurnool : నాగర్ కర్నూల్ లో భారీ వర్షానికి కూలిన మట్టిమిద్దె.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో వనపట్ల గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే కురిసిన భారీ వర్షానికి మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.

Heavy rain in Nagar-Kurnool caused landslides.. 4 people died in the same family
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో వనపట్ల గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే కురిసిన భారీ వర్షానికి మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. తల్లి పద్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మరణించినట్లు సమాచారం.. ఈ ఘటనలో తండ్రికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు.
ఇక విషయంలోకి వెళితే.. వనపట్ల గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఇంట్లో అందరూ తిని నిద్రపోయారు. కాగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి అర్థరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు అక్కడికి అక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులు పద్మ (తల్లి), పప్పి, వసంత (కుమార్తెలు), విక్కీ (కుమారుడి)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.