Uttarakhand Heavy Floods : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. కేధార్ నాథ్ లో చిక్కుకున్న 571 యాత్రికులు..
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు స్థానిక ప్రజలే కాకుండా చార్ ధామ్ (Char Dhai Yatra) యాత్రికులకు కూడా తీవ్ర అటంకం కలిగిస్తుంది.
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు స్థానిక ప్రజలే కాకుండా చార్ ధామ్ (Char Dhai Yatra) యాత్రికులకు కూడా తీవ్ర అటంకం కలిగిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలతో.. వరదలతో పలు మార్లు చార్ ధాయ్ యాత్రకు బ్రేక్ పడింది. తాజాగా మరోసారి కేదార్నాథ్ – బద్రినాథ్ మార్గంలో 200 మంది.. కేధార్ ధామ్ (Kedar Nath Yatra) ట్రెక్కింగ్ లో 571 యాత్రికులు చిక్కుకున్నట్లు సమాచారం..
ఇక విషయంతోకి వెళితే..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొన్ని రెండు నెలలుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయంత తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవిస్తున్నాయి. దీనికి తోడు కేదార్నాథ్ (Kedar Nath), బద్రీనాథ్ (Badrinath) జాతీయ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికి చాలా మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో తెలంగాణ యాత్రికులు కూడా మృతి చెందారు.
ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నౌతాడ్ టోకో (Nautad Toko) లో పర్వతాల వద్ద భారీగా వర్షం కురువడంతో.. పర్వతం పైనుంచి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవహిస్తుంది. దీంతో ఆ వరద ప్రవాహానికి ఒక హోటల్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. టెహ్రీలో ఇద్దరు మృతి చెందారు. ఇక భారీ వర్షాలకు కేదార్‌నాథ్ – బద్రినాథ్ పర్యాటకులు 200 మంది చిక్కుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న NDRF సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ముందస్తుగా భారీ వర్షాలకు కొన్ని రహదారులను మూసివేశారు BRO అధికారులు.. వర్షం సృష్టించిన బీభత్సంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.
- కేధార్ నాథ్ లో చిక్కుకున్న 571 మంది యాత్రికులు..
రుద్రప్రయాగ్ జిల్లాలోని లించోలిలో కొండచరియలు విరిగిపడటంతో.. కేదార్ నాథ్ ధామ్ కు వెళ్లే ప్రధాన రహదారి ద్వంసం అయ్యింది. దీంతో వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు రంగంలోకి దిగాయి. ఘటన స్థలంలో చిక్కుకున్న వారిని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ లో వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కేధార్ నాథ్ లో చిక్కుకున్న 571 మంది యాత్రికులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు BRO అధికారి తెలిపారు.
NDRF యొక్క 15 బెటాలియన్ కమాండెంట్ సుదేష్ డ్రాల్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు మేము సోన్‌ప్రయాగ్/గౌరీకుండ్ మధ్య చిక్కుకున్న 571 మంది యాత్రికులను రక్షించాము. వర్షం కారణంగా రోడ్డు కొట్టుకుపోయింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుంచి చిన్నారులతో సహా యాత్రికులను కాలినడకన ప్రత్యామ్నాయ మార్గం ద్వారా తీసుకొచ్చారు. ఇది కాకుండా, కేదార్‌నాథ్-గౌరీకుండ్ మార్గంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి రాష్ట్ర పరిపాలన కూడా చాపర్‌లను ఉపయోగిస్తోంది.
మరో వైపు మలానా గ్రామం సమీపంలో మలానా డ్యామ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో డ్యాంకు అవతల సుమారుగా 35 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను హెలికాప్టర్ ద్వారా రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు BRO అధికారులు వెల్లడించారు. మరో ప్రాంతం అయిన.. మండిలోని చుహార్ లోయలోని రాజ్‌వాన్స్ గ్రామంలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో రెండు మృతదేహాలు లభ్యం కాగా.. తొమ్మిది మంది శిథిలాల మధ్య చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం.. సంఘన స్థలంలో NDRF రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.