Brazil country : బ్రెజిల్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి..
బ్రెజిల్ దేశం (Brazil country) ప్రకృతి రమణీయతకు.. పర్యాటక ప్రాంతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు ఉందో అందరికి తెలిసిందే.. అమ్మాయి అందానికి పెట్టింది పేరు బ్రెజిల్ అంటే నమ్మండి. ప్రపంచ పర్యటనకు అక్కడి అందమైన అమ్మాయిలకు.. మహిళలకు మంత్ర ముద్దు అవుతారు. ఇలాంటి దేశంలో ఇప్పుడు వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.

Heavy rains in Brazil.. 37 people died..
బ్రెజిల్ దేశం (Brazil country) ప్రకృతి రమణీయతకు.. పర్యాటక ప్రాంతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు ఉందో అందరికి తెలిసిందే.. అమ్మాయి అందానికి పెట్టింది పేరు బ్రెజిల్ అంటే నమ్మండి. ప్రపంచ పర్యటనకు అక్కడి అందమైన అమ్మాయిలకు.. మహిళలకు మంత్ర ముద్దు అవుతారు. ఇలాంటి దేశంలో ఇప్పుడు వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.
తాజాగా బ్రెజిల్ దేశంలో భారీ వర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. బ్రెజిల్లోని దక్షిణ రాష్ట్రమైన ‘రియో గ్రాండే దో సుల్’లో (Rio Grande do Sul) వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు ఇప్పటికే 37 మందిని బలితీసుకున్నాయి. మరో 74 మంది గల్లంతయ్యారు. ఒక్కసారిగా వాతావరణం అదుపు తప్పినట్లు భారీ వర్షాలు.. వరదలు బీభత్సం సృష్టించాయని.. ఆ రాష్ట్ర గవర్నర్ ఎడూర్డో లీట్ (Governor Eduardo Leite) వెల్లడించారు. వర్షం కారణంగా 10 వేల మందికి పైగా ప్రజలు ఆవాసాలు కోల్పోయారు. ఈ భారీ కుంభవృష్టి ఆ బ్రెజిల్ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తుగా ‘రియో గ్రాండే దో సుల్’ గవర్నర్ వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదలకు ఇళ్లు, వంతెనలు, రహదారులు కోట్టుకపోయాయి. ఇక కొండచరియలు విరిగి పడడంతో చాలా ప్రాంతాలు మట్టిదిబ్బలను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వాహనాలన్నీ ఆ మట్టిలో కురుకుపోయాయి. స్థానిక గుయిబా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గల్లంతు అయిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపాయి.
ఇక అపత్కర పరిస్థితుల్లో ఫెడరల్ బలగాలు భారీగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. 12 విమానాలు, 45 వాహనాలు, 12 బోట్లను రంగంలోకి దించాయి. సుమారు 700 మంది సైనికులు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇళ్లు కోల్పోయినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహారం, తాగు నీటిని అందిస్తున్నారు.
SSM