Kullu, Manali Floods : హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం.. కులు, మనాలి లో రెడ్ అలర్ట్..
భారత దేశ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన కులు, మనాలీ (Manali) సమీపంలో గురువారం రాత్రి కుంభవృష్టి కురిసింది.
భారత దేశ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన కులు, మనాలీ (Manali) సమీపంలో గురువారం రాత్రి కుంభవృష్టి కురిసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మేఘవిస్ఫోటనం జరిగి షిమ్లా, మండి, కులు జిల్లాలో గత 24 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల (Heavy Rains) తో స్థానికంగా ఉన్న అంజనీ మహాదేవ్ ఆలయం (Anjani Mahadev Temple) వద్ద ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఒక్క సారిగా సమీప ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అంజనీ మహాదేవ్ కాల్వ ఉప్పొంగి ప్రవహించడంతో… పల్చన్ లోని బ్రిడ్జ్ పై పెద్ద ఎత్తున బండరాళ్లు వరదకు కొట్టుకోచ్చాయి.
దీంతో దేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశం అయిన లడ్డాఖ్ (Ladakh) కు ప్రధాన రోడ్డు మార్గం ద్వంసం అయ్యింది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కులు (Kullu), మండీ, సిమ్లా (Shimla), చంబా, కంగ్రా, సిర్మౌర్ జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని అంచనా వేసింది. ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హిమణి నదుల్లో ఉద్ధృతి పెరగ్గా… అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి.. ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ఇళ్లు నేలమట్టంకాగా అనేక చోట్ల రైలు పట్టాలపైనా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ కాగా ఆకస్మిక వరదల (Flash floods) వల్ల ఇప్పటివరకు హిమాచల్‌లో 3 వేర్వేరు జిల్లాలో ఐదుగురు మరణించారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రిడ్జిలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు (CM Sukhwinder Singh Sukh) తెలిపారు. దీంతో ముందు జాగ్రతగా.. విద్యాసంస్థలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలకు నదులన్నీ పొంగిపొరులుతూ దిగువ రాష్ట్రాల వైపు ప్రవహిస్తున్నాయి.