Weather, IMD : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. చిగురుటాకులా వణుకుతున్న హిమాచల్, ఉత్తరాఖండ్.. హరిద్వార్ ను ముంచెత్తిన వరదలు

ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురిపిస్తుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2024 | 04:00 PMLast Updated on: Jul 02, 2024 | 4:00 PM

Heavy Rains In Northern States Himachal And Uttarakhand Are Shaking Like Twigs Floods Inundated Haridwar

ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురిపిస్తుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ ద్వారం అయిన హరిద్వార్ ను ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పొటెత్తాయి. దీంతో ప్రధాన రహదారులు జలమయం కావడంతోపాటు ఇళ్లలోకి పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. కాగా ఎప్పుడు ఎండిపోయి కనిపిస్తున్న సుఖీ నదికి వరద నీరు వచ్చి తీవ్ర నష్టాన్ని చేకుర్చింది. నది ఎప్పుడు ఎండిపోయి నీరు లేక ఉండటంతో స్థానికులు ఆ నది ప్రాంతాల్లో పలు కార్లు, బస్సులను పార్కింగ్ చేసుకున్నారు. ఆకస్మిక వరదల వల్ల నదిలో ఉన్న బైకులు, కార్లు, బస్సులు, టెంపో వాహనాలు, అన్ని కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నది కొద్ది దూరంలో గంగాలో కలుస్తుంది. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఎవరూ నదీ సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల అక్కడి పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలకు కుల్లు, మనాలి జిల్లాలో పర్యటకులతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరో వైపు కుల్లు లోని ప్రముఖ సెల్పీ పాయిట్ వద్ద కొండచరియలు విరిగిపడయ్యాయి. దీంతో పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం.. ప్రస్తుతం ఎటువంటి పర్యటనలు చేయవద్దని.. భారీ వర్షాల నేపథ్యంలో తాత్కాలికంగా కుల్లు జిల్లాలోని బియాస్ నది నదిలో వరద అంచలంచలుగా పెరగడంతో రివర్ రాఫ్టింగ్ ఆక్టివిటీస్ ను రద్దు చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు.