బెజవాడలో గజ వాన, 50 ఏళ్ళలో చూడలేదంటున్న స్థానికులు
విజయవాడలో గత 50 ఏళ్ళుగా ఈ స్థాయిలో వర్షం లేదంటున్నారు అక్కడి ప్రజలు. గత రాత్రి నుంచి విరామం లేకుండా వర్షం పడటంతో దాదాపుగా విజయవాడ మొత్తం జల దిగ్బంధంలోనే ఉంది. లోతట్టు ప్రాంతాలతో పాటుగా కాస్త సేఫ్ అనుకున్న ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరింది.
విజయవాడలో గత 50 ఏళ్ళుగా ఈ స్థాయిలో వర్షం లేదంటున్నారు అక్కడి ప్రజలు. గత రాత్రి నుంచి విరామం లేకుండా వర్షం పడటంతో దాదాపుగా విజయవాడ మొత్తం జల దిగ్బంధంలోనే ఉంది. లోతట్టు ప్రాంతాలతో పాటుగా కాస్త సేఫ్ అనుకున్న ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. దీనితో అసలు ప్రజలు బయటకు వెళ్ళే సాహసం కూడా చేయడం లేదు. విజయవాడ రూరల్ లోని పోరంకి, పెనమలూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల దెబ్బకు రోడ్లపై నీరు వచ్చి చేరింది.
కానూరు, ఆటోనగర్, బస్టాండ్ సెంటర్, పోరంకి, ఎల్ ఐసి కాలనీ సహా పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మోకాలు లోతు నీళ్ళతో ప్రజలు బయటకు రావడమే కష్టంగా మారింది. వర్షాలపై స్పందిస్తున్న స్థానికులు తాము 50, 60 ఏళ్ళలో ఇంతటి వర్షాలను చూడలేదని, తమ ప్రాంతాల్లో వరదలు అనే మాటే తెలియదని ఇప్పుడు ఈ వర్షాలను చూసి భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో భారీ వర్షాల దెబ్బకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.