Himachal Heavy Snowfall : హిమాచల్ లో భారీగా హిమపాతం.. మనాలి లో విరిగిపడ్డ కొండచరియలు.. 3 నేషనల్ NH హైవేలు మూసివేత..
మనాలి - కీ లాంగ్ (Keylong) - సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh).. భారత దేశ సందర్శన ప్రాంతాల్లో దేశానికే తలమానికం.. కాశ్మీర్ (Kashmir) స్వర్గపు దారికి హిమచల్ ప్రదేశ్ ముఖ ద్వారం.. కాగా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో నిన్న.. నేడు.. సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎత్తైన ప్రాంతాలలో హిమపాతం.. మరో వైపు చిన్న చిన్న కొండలపై భారీగా వర్షం కురుస్తుంది. దీంతో 104 రోడ్లు మూడు జాతీయ రహదారులను తాత్కలికంగా ముసివేస్తున్నట్లు (BRO) అధికారులు ప్రకటించారు. లాహౌల్ మరియు స్పితిలోని 99 రహదారులతో సహా 104 రోడ్లు మంచు కారణంగా మూసుకుపోయాయని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం తెలిపింది.
మనాలి – కీ లాంగ్ (Keylong) – సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు. గ్రామ్‌ఫు-లోసర్, దర్చా-సర్చు – రోహ్‌తంగ్ పాస్‌లపై ఉద్యమం లాహౌల్ – స్పితి వ్యాలీ (Spiti Valley) భారీగా హిమపాతం కురుస్తున్నట్లు (BRO) వెల్లడించింది.
భారీ వర్షాలకు మనాలి – కీలాంగ్ – సిస్సు వ్యాలీ లో విరిగిపడ్డ కొండచరియలు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) క్లియర్ చేయడానికి భారీ యంత్రాలను తరలించింది. దీంతో మనాలి హైవేపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో రెండు మూడు గంటల్లో ట్రాఫిక్ పునరుద్దించనున్నట్లు BRO ప్రతినిధి తెలిపారు. స్థానిక వాతావరణ కేంద్రం ఏప్రిల్ 22 మరియు 23 తేదీలలో వివిక్త ప్రదేశాలలో ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.. దీంతో హిమాచల్ ప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతవరణ శాఖ..
- నేటి నుంచి ఏప్రిల్ 26 నా మనాలిలో కుంభ వృష్టి…
మరోవైపు భారత వాతావరణ శాఖ నేటి నుంచి ఏప్రిల్ 26 వరకు వచ్చే ఆరు రోజులలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారీగా కొండ విరిగిపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. స్పితి వ్యాలీలో మాత్రం భారీగా హిమపాతం కురుస్తుందని అంచనా వేసింది. కోక్సర్‌లో 19 సెం.మీ హిమపాతం నమోదైంది, ఆ తర్వాత గోండ్లాలో 16.5 సెం.మీ, కీలాంగ్ 8.5 సెం.మీ, కుకుమ్‌సేరిలో 2.4 సెం.మీ నమోదైందని వాతావరణ సమాచారం. మరో వైపు అక్కడి ఎత్తైన పర్వతాలపై విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో, భర్మౌర్ – చంబాలో 25 మిమీ వర్షం, టిస్సా 24.3 మిమీ సోలన్ 24 మిమీ, రాజ్‌గఢ్ 20.4 మిమీ, కల్ప 20.2 మిమీ, రేణుక 19.4 మిమీ, కుకుమ్‌సేరి 19.3 మిమీ, కోవూస్ పియో. షిల్లారో 19 మి.మీ. వర్షాపాతం నమోదైనట్లు హిమచల్ వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ భారీగా కొండ చర్యలు విరిగిపడటంతో పర్యటకు అప్రమత్తంగా ఉండాలని మనాలి, హిమాచల్ ప్రదేశ్ టూరిజం శాఖ సూచనలు చేసింది.
- హిమాచల్ పర్యాటక ప్రదేశాలు పర్యటనలు తాత్కలిక రద్దు..
హిమాచల్ ప్రదేశ్ కు వచ్చే యాత్రికులు తాత్కాలికంగా తన పర్యటన రద్దు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ప్రస్తున్న.. మనాలి – కీ లాంగ్ లో ఉన్న యాత్రికులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీలైనంత వరకు మనాలి, సోల్ వ్యాలీ, కూల్లు, స్పితి వ్యాలీ, సోన్ మార్గ్, అటల్ టన్నల్, రోతంగ్ పాస్ వంటి పర్యటక ప్రదేశాలకు వచ్చే వారు.. సెప్టెంబర్ వరకు వేచి ఉండాలని ఆ తర్వత పర్యటకులు.. హిమచల్ ప్రదేశ్ ను సందర్శంచవచ్చని సూచనలు చేసింది.
- సిమ్లాలో మెరుపులతో కూడిన వర్షం..
భారతదేశంలో క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ గా పిలువబడే సిమ్లా లో మెరుపులతో కూడిన అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ సూచించింది. భాగీ మేఘావృతమై ఉంటుందని.. ఎత్తైన పర్వతాలపైకి ట్రెక్కింగ్ లాంటి సాహసాలు చేయవద్దని హెచ్చరించింది. మరో వైపు భారీ ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉండటంతో.. అక్కడ పండే యాపిల్, గోధుమ పంటలకు నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని రైతులకు సూచించింది.
SSM.