CHANDRABABU NAIDU: అరకు బయల్దేరిన చంద్రబాబు.. దారితప్పిన హెలికాప్టర్
చంద్రబాబు నాయుడు.. శనివారం అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకోసం మొదట ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.
CHANDRABABU NAIDU: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. ఒక రూట్‌లో వెళ్లాల్సిన హెలికాప్టర్ మరో రూట్‌లో వెళ్లింది. ఇది గుర్తించిన ఏటీసీ.. పైలట్లను హెచ్చరించారు. అనంతరం ఏటీసీ సూచనతో తిరిగి హెలికాప్టర్ సరైన మార్గంలో వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నాయుడు.. శనివారం అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకోసం మొదట ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.
KTR: రేవంత్ రక్తం బీజేపీదే.. వంద రోజుల్లో హామీలు అమలు చెయ్.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..
అయితే, ఏటీసీ సూచనల్ని పైలట్ అర్థం చేసుకోలేకపోవడంతో, హెలికాప్టర్‌ను రాంగ్ రూట్‌లో తీసుకెళ్లారు. ఇది గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. హెలికాప్టర్ రాంగ్ రూట్‌లో వెళ్తున్నట్లు చెప్పారు. పైలట్.. ఏటీసీతో సమన్వయం చేసుకునే విషయంలో లోపం తలెత్తడంతోనే ఇలా జరిగినట్లు సమాచారం. చివరికి ఏటీసీ.. పైలట్‌ను హెలికాప్టర్ బయలుదేరిన చోటుకే రావాలని సూచించడంతో తిరిగి విశాఖకు వచ్చేశారు. అక్కడనుంచి మళ్లీ పైలట్ సరైన రూట్‌లో వెళ్లగలిగేలా ఏటీసీ ఆదేశించింది. ఏటీసీ సూచనతో సరైన మార్గంలో హెలికాప్టర్‌ను తీసుకెళ్లిన పైలట్లు.. చివరకు అరుకులో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. ఏ ఆటంకం లేకుండా చంద్రబాబు అరకు చేరుకున్నారు.
అయితే, ఈ విషయంలో కొద్దిసేపు ఉత్కంఠ కొనసాగింది. అరకుతో పాటు మన్యం ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువ. గతంలో నక్సలైట్లు చంద్రబాబుపై దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత కావడంతో హెలికాఫ్టర్ దారి తప్పిందని తెలిసి, అధికారులు కంగారు పడ్డారు. కానీ, కొద్దిసేపటికే హెలికాప్టర్ మళ్లీ సరైన దారిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.