Bangalore Rave Party, Hema : హేమ సుద్దపూసేం కాదు… మహానటి.. డ్రగ్ టెస్ట్ రిపోర్టులో సంచలనాలు..
ఎప్పుడయితే రేవ్ పార్టీ వ్యవహారం బయటకు వచ్చిందో.. హేమలో మహానటి అప్పుడే నిద్రలేచింది. సినిమాలకు మించి యాక్టింగ్ మొదలుపెట్టింది.

Hema is not Suddapusem... Mahanati.. Sensations in drug test report..
ఎప్పుడయితే రేవ్ పార్టీ వ్యవహారం బయటకు వచ్చిందో.. హేమలో మహానటి అప్పుడే నిద్రలేచింది. సినిమాలకు మించి యాక్టింగ్ మొదలుపెట్టింది. సంప్రదాయిని.. సుప్పిని.. సుద్దపూసని లెవల్‌లో జనాలను పిచ్చోళ్లను చేసే ప్రయత్నం చేసింది. రేవ్ పార్టీలో లేను హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసి ఒకసారి.. చికెన్ బిర్యానీలో మసాలా ఎంత వేయాలి ఫ్రెండ్స్ అని ఓవరాక్షన్ చేస్తూ ఇంకోసారి వీడియో రిలీజ్ చేసి.. రేవ్ పార్టీతో సంబంధం లేదు అన్నట్లు మహానటి లెవల్‌లో యాక్టింగ్ చేసింది.
బెంగళూరు పోలీసులు పార్టీలో హేమ ఉందని పదేపదే చెప్పినా.. అర్థం లేని వీడియోలు చేస్తూ అడ్డంగా బుక్ అయింది. కట్ చేస్తే హేమ బాగోతం అంతా మరోసారి బయటపడింది. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. రేవ్‌పార్టీలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఉన్నట్లు తేలింపది. దీంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని పదేపదే హేమ చెప్పిన మాటలన్నీ అబద్దాలు అని తేలిపోయింది. రేవ్ పార్టీలో పాల్గొన్న 103మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించిన నార్కోటిక్ టీమ్.. 86మంది రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేల్చింది. 59 మంది పురుషులు, 27మంది మహిళల రక్తనమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
ఇందులో హేమ ఒకరు. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిన 86మందికి.. సీసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హేమను డ్రగ్స్ బాధితురాలిగా నార్కోటిక్స్ పరిగణిస్తోంది. హేమకు అధికారులు త్వరలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. రేవ్ పార్టీలో లేను అంటూ హేమ చెప్పింది అంతా అబద్దం అని కర్ణాటక అధికారులు మరోసారి క్లియర్‌కట్‌గా తేల్చేశారు. ఆమె అక్కడే ఉందని కన్ఫార్మ్ చేశారు. రేవ్ పార్టీ సంగతి ఎలా ఉన్నా… హేమ చేసిన ఓవరాక్షన్‌కు ఐదారు ఆస్కార్‌లు ఇవ్వొచ్చు అంటూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంత రచ్చ జరుగుతుంటే.. చికెన్ బిర్యానీ చేస్తూ వీడియో చేసి మరీ.. జనాలను నమ్మించే ప్రయత్నం చేసిందంటే.. అది మాములు గుండె కాదు అంటూ మీమ్స్ పేలుతున్నాయ్.