Keerthi Suresh: అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
కీర్తీ సురేష్ కి మూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో వివాహం అంటూ వచ్చిన వార్తలపై ఆమె తండ్రి స్పందించారు.

Her father was shocked by the news of Keerthy Suresh's marriage with music director Anirudh
సదరన్ మూవీస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి కీర్తిసురేష్. ఆమె పెళ్లి గురించి ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయ్. ఇప్పుడు కూడా మళ్లీ స్టార్ట్ అయ్యాయ్. కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఈ వార్తలపై కీర్తి ఫాదర్ రియాక్ట్ అయి.. అలాంటిది ఏదైనా ఉంటే ముందుగా మీకే చెబుతాము అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలా పెళ్లి విషయంలో కీర్తి సురేష్, తన తండ్రి ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మ్యారేజ్ వార్తలకు మాత్రం అడ్డుకట్టు వేయలేకపోతున్నారు.
ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ మరొక వార్త వైరల్ అవుతుంది. ఇలా అనిరుద్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ వస్తున్నటువంటి వార్తలపై కీర్తి సురేష్ తండ్రి రియాక్ట్ అయ్యారు. ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. కీర్తి పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నీ ట్రాష్ అన్నారు. ఇక కీర్తి సురేష్ గురించి ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. ఇదివరకే ఆమె గురించి ఎన్నో వార్తలు వచ్చాయ్. ఐతే అనిరుధ్‌తో తన పెళ్లి అంటూ వస్తున్న ఈ వార్తలను.. ఎవరో కావాలనే ప్రచారం చేస్తున్నారని ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.
ఇక వీరిద్దరి పెళ్లి అంటూ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. అనిరుధ్, కీర్తి సురేష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. కీర్తి సురేష్ నటించిన కొన్ని సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి పెళ్లి అంటూ వార్తలు తెరపైకి వచ్చాయ్. దీంతో ఇద్దరి పెళ్లి అంటూ ప్రచారం అందుకుంది. ఐతే కీర్తి తండ్రి ఇచ్చిన క్లారిటీతో పెళ్లి ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.