Hero Venkatesh : ఎన్నికల ప్రచారానికి సిద్దమైన హీరో వెంకటేశ్…

లోక్ సభ ఎన్నికల తెలంగాణలో హిట్ మీదా ఉన్నాయి. రోజు రోజుకూ తెలంగాణ రాజకీయాలు కీలక మార్పులకు జరుగుతున్నాయి. మే 13న పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇక హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి కూడా డేట్ ఫిక్స్ అయ్యింది,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 1, 2024 | 05:35 PMLast Updated on: May 01, 2024 | 5:35 PM

Hero Venkatesh ఎన్నికల ప్రచారానికి సి

ఎన్నికలు అంటే రాజకీయ నాయకులకు – ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటాయి. కాలం మారింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ తారలు ప్రచారం లోకి దిగుతున్నారు. పిఠాపురంలో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు ఎన్నికల ప్రచారం చేసేందుకు.. హీరో వరుణ్ తేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్, ఆది.. స్టార్ కోరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రేపో మాపో టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ లో కూడా ఓ స్టార్ సీనియర్ హీరో తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అది కూడా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. అవును విక్టరీ వెంకటేష్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.

లోక్ సభ ఎన్నికల తెలంగాణలో హిట్ మీదా ఉన్నాయి. రోజు రోజుకూ తెలంగాణ రాజకీయాలు కీలక మార్పులకు జరుగుతున్నాయి. మే 13న పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇక హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి కూడా డేట్ ఫిక్స్ అయ్యింది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి (Raghuram Reddy) తరఫున వెంకటేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మే 7 నుంచి రఘురాం రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రఘురాం రెడ్డికి హీరో వెంకటేష్ వియ్యంకులు.

కాంగ్రెస్ కోసం వెంకటేశ్ పెద్ద కూతురు ప్రచారం..

కాగా ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తన మామ, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామి రెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. రఘురామి రెడ్డి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారనేది వివరించారు. ఐదేళ్లలో నామా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

SSM