అమ్మాయిల బాత్ రూంలో హిడెన్ కెమెరా వీడియోలు ఎవరికి పంపాడంటే
బస్టాండ్లు రైల్వేస్టేషన్లే కాదు.. ఆఖరికి కాలేజీ హాస్టల్స్‌లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. గుడివాడలోని శేషాద్రి రావు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్‌లో హిడెన్ కెమెరా దొరికింది. ఏకంగా అమ్మాయిల బాత్ రూంలో హిడెన్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డ్ చేశాడు ఓ దరిద్రుడు.
బస్టాండ్లు రైల్వేస్టేషన్లే కాదు.. ఆఖరికి కాలేజీ హాస్టల్స్‌లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. గుడివాడలోని శేషాద్రి రావు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్‌లో హిడెన్ కెమెరా దొరికింది. ఏకంగా అమ్మాయిల బాత్ రూంలో హిడెన్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డ్ చేశాడు ఓ దరిద్రుడు. అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్‌కుమార్ అనే విద్యార్థి ఈ పని చేసినట్ట తెలియడంతో స్టూడెంట్స్ అంతా అతనిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ వ్యవహారంలో కాలేజ్ మేనేజ్‌మెంట్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాత్‌రూంలో హిడెన్ కెమెరా దొరికిన వెంటనే తాము మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశామని విద్యార్థినిలు చెప్తున్నారు. కానీ వాళ్లు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేం లేక కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆందోళనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారంలో విజయ్‌కి ఓ అమ్మాయి కూడా సహకరించినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఆ అమ్మాయి సహాయంతో విజయ్ కుమార్ గర్ల్స్ హాస్టల్ బాత్ రూంలో హిడెన్ కెమెరా ఫిక్స్ చేశాడని చెప్తున్నారు.
ఇప్పటి వరకూ ఆ కెమెరాతో 300 మంది అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ వీడియోలు బయటి వ్యక్తులకు విజయ్ అమ్మేవాడని చెప్తున్నారు. ఎంత మంది అమ్మాయిల వీడియోలు తీశాడు.. ఈ వీడియోలు ఎవరెవరికి అమ్మాడు.. ఇంటర్నెట్‌లో ఏమైనా పోస్ట్ చేశారా అనే విషయాలపై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇష్యూ సీరియస్ అవ్వడంతో సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఏకంగా కాలేజీ హాస్టల్లో ఇలాంటి పని చేసిన వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. కాలేజీలో పరిస్థితి గురించి ఆరా తీయాలంటూ మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించడంతో ఆయన జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. స్వయంగా కాలేజీకి విచారణ జరిపించాలని సూచించారు.