ఇంజనీరింగ్ కాలేజ్ లో కెమెరాలు, నిజమేనా…?
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో నిన్న జరిగిన సంఘటనపై గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్ళారు.

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో నిన్న జరిగిన సంఘటనపై గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్ళారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించబడలేదని స్పష్టం చేసారు. పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారని ఆయన పేర్కొన్నారు.
నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు తాము గుర్తించలేదు అన్నారు ఎస్పీ. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. తదుపరి విచారణ జరుగుతోందని, ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు హాస్టల్ లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సిఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.