ప్రియురాలి సజీవ దహనం లారెన్స్‌ లైఫ్‌లో ఎవరికీ తెలియని కోణం

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌. ప్రస్తుతం నార్త్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న పేరు ఇది. 1990లలో డీ-కంపెనీ ఫైనాన్స్‌ క్యాపిటల్‌ను ఎలా వణికించిందో.. ఇప్పుడు లారెన్స్‌ గ్యాంగ్‌ కూడా నార్త్‌ ఇండియాను అలానే వణికిస్తోంది. మహారాష్ట్ర ఎక్స్‌ మినిస్టర్‌ బాబా సిద్ధికీ మర్డర్‌తో లారెన్స్‌ పేరు మరోసారి దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2024 | 08:14 PMLast Updated on: Oct 15, 2024 | 8:14 PM

Hidden Secrets In Lawrence Bishnoi Life

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌. ప్రస్తుతం నార్త్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న పేరు ఇది. 1990లలో డీ-కంపెనీ ఫైనాన్స్‌ క్యాపిటల్‌ను ఎలా వణికించిందో.. ఇప్పుడు లారెన్స్‌ గ్యాంగ్‌ కూడా నార్త్‌ ఇండియాను అలానే వణికిస్తోంది. మహారాష్ట్ర ఎక్స్‌ మినిస్టర్‌ బాబా సిద్ధికీ మర్డర్‌తో లారెన్స్‌ పేరు మరోసారి దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. జస్ట్‌ 31 ఏళ్ల వయసులోనే మరో దావూద్‌ను తలపిస్తున్నాడు ఈ గ్యాంగ్‌స్టర్‌. ఏ మనిషైనా ఇంత కిరాతకంగా మారాడు అంటే ఐతే పిచ్చోడు ఐనా అయ్యుండాలి లేదంటే ఏదో ఘటన ఆ మనిషిని మార్చేసి ఉండాలి. లారెన్స్‌ బిష్ణోయ్‌ జీవితంలో కూడా ఇలాంటిదే ఓ ఘటన ఉంది. పంజాబ్‌లో పుట్టిన లారెన్స్‌ బిష్ణోయ్‌ మంచి రిచ్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. లారెన్స్‌ టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న సమయంలో తన క్లాస్‌మేట్‌ కాజల్‌ను ప్రేమించాడు.

బయటి వాళ్లకు కిరాతకుడు ఐనా.. ప్రియురాలు అంటే మాత్రం లారెన్స్‌కు పిచ్చి. కాజల్‌కు కూడా లారెన్స్‌ అంటే అంతే ఇష్టం. స్కూలింగ్‌ పూర్తైన తరువాత పంజాబ్‌ యూనివర్సీటీకి వెళ్లాడు లారెన్స్‌. అక్కడే అతని జీవితం మారిపోయింది. మొదట స్టూడెంట్‌ పాలిటిక్స్‌తో మొదలైన లారెన్స్‌ తరువాత క్రిమినల్‌ సామ్రాజ్యం వైపు అడుగులు వేశాడు. తన ఉనికిని చాటుకునేందుకు వేరే వాళ్లను భయపెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే లారెన్స్‌కు శతృవులు ఎక్కువయ్యారు. కాలేజీలో గ్యాంగ్‌ వార్స్‌ జరుగుతున్న సమయంలోనే లారెన్స్‌ను ఏం చేయలేని ఓ ప్రత్యర్థి వర్గం అతని గర్ల్‌ఫ్రెండ్‌ కాజల్‌ను చంపేశారు. బతికుండగానే పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశారు. ఈ ఘటన లారెన్స్‌ను పూర్తిగా మార్చేసింది. లవర్‌ చనిపోయిన డిప్రెరషన్‌లో తాను మనిషి అని కూడా మర్చిపోయాడు లారెన్స్‌. తన లవర్‌ను చంపిన ప్రతీ ఒక్కన్నీ వెతికి వేటాడి మరీ చంపేశాడు. అప్పటి నుంచీ పూర్తిగా కిరాతకుడిలా మారిపోయాడు. తన క్రిమినల్‌ సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా పెంచుకుంటూ వచ్చాడు.

గంజాయి నుంచి గన్స్‌ వరకూ అన్నీ స్మగ్లింగ్‌ చేస్తూ.. ఇప్పుడు ఏకంగా దావూద్‌ను రీప్లేస్‌ చేసే స్థాయికి వచ్చాడు. ఇంత చేసిన లారెన్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయలేదా అంటే.. అదే అన్నికంటే పెద్ద ట్విస్ట్‌. లారెన్స్‌ ఆల్రెడీ జైల్‌లోనే ఉన్నాడు. తాను చేసే క్రిమినల్‌ యాక్టివిటీస్‌ అన్నీ జైలు నుంచే చేయిస్తున్నాడు. లారెన్స్‌ తమ్ముడు, మరో క్లోజ్‌ ఫ్రెండ్‌ కెనడా నుంచి లారెన్స్‌ కోసం పని చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద గ్యాంగ్‌ను నడుపుతున్నారు. గతంలో జరిగిన పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ హత్య, రీసెంట్‌గా జరిగిన మాజీ మినిస్టర్‌ సిద్ధికీ హత్య రెండూ లారెన్స్‌ జైలులో ఉండి చేయించినవే. త్వరలోనే హీరో సల్మాన్‌ ఖాన్‌ను కూడా చంపేస్తానంటూ లారెన్స్‌ శపథం చేశాడు. సిద్దికీ హత్య నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌కు ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. ఇలా ప్రపంచం మొత్తానికి క్రిమినల్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా తెలిసిన లారెన్స్‌ జీవితంలో గుండెల్ని పిండేసే ఓ ఘటన కూడా ఉంది.