Telugu states, High Alert : తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 26వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాటు కూడా పడే అవకాశం లేదని తెలిపింది.

High alert for Telugu states.. Heavy rains in next 24 hours
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 26వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాటు కూడా పడే అవకాశం లేదని తెలిపింది. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రాత్రి టెంపరేచర్లు మరింత పడిపోతాయని తెలిపింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని,ఉదయం పొగమంచు కమ్మేస్తుందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో.. దక్షిణాది రాష్ట్రాలకు బంగాళాఖాతం నుంచి భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో గురువారం పలుచోట్ల వర్షం కురిసింది. ఇక రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనంతో ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
Priyanka : యశస్విని కోసం రంగంలోకి దిగిన ప్రియాంక.. ఎర్రబెల్లి కేడర్లో వణుకు..
కాగా, గురువారం రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. గురువారం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉదయం నుంచి మబ్బులు పట్టగా,జల్లుల్లు పడ్డాయి. హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే జల్లులు పడ్డాయి.
తెలంగాణలో వర్షపాతం..
ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని,అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 27.5మి.మీ వర్షపాతం,మెదక్ లో 17 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 17.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు తూర్పు,ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం..
బాపట్ల జిల్లా కూచినపూడిలో 50.25, ఏలూరు జిల్లా నూజివీడులో 47.25, కృష్ణా జిల్లా భదేవరపల్లిలో 45.5, అన్నమయ్య జిల్లా వెలిగల్లులో 38 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వరి, పత్తికి స్వల్ప నష్టం వాటిల్లింది. వరి పైరు కోసి, ఓదెలపై ఉన్న పనులు, నూర్చి, ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కుప్పలు తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం కారణంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో పండించిన పత్తి కూడా కొద్దిగా తడిసింది.
ఈ నెల 25న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం మూసుకుంటోందని, దీని కారణంగా 26న అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత అది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి రైతులకు నష్టం కలిగిస్తుండగా.. ఇతర పంటలకు జీవం పోస్తోంది. గత వారం బంగాళాఖాతంలో తుపాను వచ్చినా రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో వరి, పత్తి రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.