Durgam Pond, Fish Kill : దుర్గం చెరువులో చేపల మృతిపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్ లో ప్రముఖ పర్యటక ప్రదేశం.. తెలంగాణలో మొదటి కేబుల్ బ్రిడ్జి నిర్మాణం అయిన దుర్గం చెరువు దేశ విదేశాలను నుంచి పర్యటకులను ఆకార్షించింది దుర్గం చెరువు. ఇప్పుడు ఆ దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. వేలాదిగా చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి.

High Court is serious about the death of fish in Durgam pond
హైదరాబాద్ లో ప్రముఖ పర్యటక ప్రదేశం.. తెలంగాణలో మొదటి కేబుల్ బ్రిడ్జి నిర్మాణం అయిన దుర్గం చెరువు దేశ విదేశాలను నుంచి పర్యటకులను ఆకార్షించింది దుర్గం చెరువు. ఇప్పుడు ఆ దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. వేలాదిగా చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. మరికొన్ని చేపలు ఆక్సిజన్ ఆందక నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నాయి. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల మృత్యువాతపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చెరువులోని నీటిని పరీక్షించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా దుర్గంచెరువులో చేపల మృత్యువాత.. హైకోర్టు సీరియస్ అయ్యింది. దుర్గంచెరువులో వందల సంఖ్యలో చేపల మృత్యువాత కథనాలపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (ప్రజా ప్రయోజనాల పరిరక్షణ) కింద సుమోటోగా తీసుకుంది. PILను డిసెంబర్ 18న ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించనుంది. జిల్లా కలెక్టర్, మున్సిపల్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, GHMC కమిషనర్, HMWS మేనేజింగ్ డైరెక్టర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ను ప్రతివాదులుగా చేర్చింది.