K. Raghavendra Rao : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ .. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కు కోర్టు నోటీసులు జారీ. ఎందుకో తెలుసా..?
బంజారాహిల్స్ పరిసర ప్రాంతంలో షేక్ పేట్ లో అత్యంత విలువైన రెండు ఎకరాల భూమి కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తో పాటు మరికొందరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వార్తాల్లో నిలిచారు.

High Court issued notices to Tollywood star director K Raghavendra Rao Do you know why?
కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) దైవం పైన సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. సినిమానే ఆయన ప్రపంచం.. పులను.. పండ్లను తెలుగు ఇండస్టీలో ఈయన వాడినంతగా ఏ దర్శకుడు వాడి ఉండరు. ఈ మధ్య కాలంలో తరచూ ఆయన వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటి వరకు చంద్రబాబు అరెస్ట్ పై ట్వీటర్ వేదికగా పోస్ట్ లు పెట్టి వైరల్ అయ్యారు. టీడీపీకి మద్దతు ఇస్తూ లోకేష్ పిలుపునిచ్చిన నిరసనల్లో పాల్గొని సోషల్ మీడియాలో.. వార్తల్లో హాట్ టాపింగ్ మరారు. ఇప్పుడు ఏకంగా కోర్టు నుంచి నోటీసులు (High Court Notices) అందుకున్నారు.
బంజారాహిల్స్ పరిసర ప్రాంతంలో షేక్ పేట్ లో అత్యంత విలువైన రెండు ఎకరాల భూమి కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తో పాటు మరికొందరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వార్తాల్లో నిలిచారు.
Star Director Shankars : ఏపీలో 8 వేల మందితో శంకర్ షూటింగ్
ఇక విషయానికి వస్తే బంజారాహిల్స్ లోని షేక్ పేట లో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. మెదక్ చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012 లో పిల్ దాఖలు చేయగా.. దానిపి విచారణ చేపట్టి రాఘవేంద్రరావుకు తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓమారు నోటీసులు జారీ చేసినా.. ఆ నోటీసులు వారికి అందలేవని రికార్డుల్లో లేకపోవడంతో గురువారం మరో సారి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. బంజారాహిల్స్ సర్వే నంబర్ 403/1లోని ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల భూమిని ప్రజాప్రయోజన వాణిజ్య అవసరాలకు వినియోగించారనేది ప్రధాన ఆరోపణలో రాఘవేంద్రరావు, ఆయన బంధువులు చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, కృష్ణమోహన్ రావు, లాలస దేవికి నోటీసులిచ్చింది. ఈ కేసు విచారణను కోర్టు జనవరి 18కి వాయిదా వేసింది.
SURESH