BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు.. సస్పెన్షన్ తప్పదా..?

బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి (Mallareddy), (మేడ్చల్), పల్లా రాజేశ్వరెడ్డి (Palla Rajeshwar Reddy), (జనగామ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2024 | 12:35 PMLast Updated on: May 02, 2024 | 12:35 PM

High Court Notices To Brs Mlas Is Suspension Wrong

బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి (Mallareddy), (మేడ్చల్), పల్లా రాజేశ్వరెడ్డి (Palla Rajeshwar Reddy), (జనగామ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ సమర్పించిన మల్లారెడ్డి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ జె.శ్రీనివాస్‌ రావులతో కూడిన సింగల్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ పోగుల వాదనలు వినిపిస్తూ.. రిటర్నింగ్‌ అధికారికి చామకూర మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్నారు. సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి అని వెల్లడించారు.

ఇక జనగామ ఎమ్మెల్యే పల్లా ఎన్నికపై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిటిషన్ వేశారు. వీరిద్దరూ తమ ఎన్నికల అఫిడవిట్లలో సరైన సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలంది. రెండు పిటిషన్లల్లోని ఆధారాలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణను జూన్‌ 16కు వాయిదా వేశారు.

SSM