Congress Party : కాంగ్రెస్ MLAs కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కు హైకోర్టు నోటీసులు.. జూన్ 5 సస్పెండ్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు (Congress MLAs) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) నోటీసులు జారీ చేసింది.

High Court notices to Congress MLAs Kadiam Srihari and Tellam Venkatrav.. June 5 suspended.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు (Congress MLAs) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) నోటీసులు జారీ చేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలో కి వెళ్లిన స్టేషన్ ఘనాపూర్, కడియం శ్రీహరి ( Kadiam Srihari), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల (Tellam Venkatarao) కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఒక జెండా కిందా గెలిచి.. మరో పార్టీలోకి జంప్ అయ్యి.. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.
దీంతో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు…
బీఆర్ఎస్ పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది. దీనికి సంబంధించి గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావిం చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసే హక్కు తమకు ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి.. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇక మరో వైపు ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని హుజూరబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. కాగా దీనిపై హైకోర్టు స్పందించి దానం నాగేందర్ నోటీసులు పంపించి విషయం తెలిసిందే.
SSM