Arabian Sea, ship, Hijacking : అరేబియా సముద్రంలో విదేశీ నౌక హైజాక్.. రంగంలోకి భారత నేవీ
ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు హైజాక్ అనే పదం పరిచిపోయింది. చాలా ఏళ్ల కిందట తీవ్రవాదులు విమానలను హైజాక్ చేసేవారు. ఇప్పుడు తాజాగా పెద్ద పెద్ద ఓడలు హైజాక్ గురవుతున్నాయి. తాజాగా యూరప్ ఖండం దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియాన్ సముద్రంలో హైజాక్ కు గురైంది.
ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు హైజాక్ అనే పదం పరిచిపోయింది. చాలా ఏళ్ల కిందట తీవ్రవాదులు విమానలను హైజాక్ చేసేవారు. ఇప్పుడు తాజాగా పెద్ద పెద్ద ఓడలు హైజాక్ గురవుతున్నాయి. తాజాగా యూరప్ ఖండం దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియాన్ సముద్రంలో హైజాక్ కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. కాగా తాజాగా ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకదళం అప్రమత్త అయ్యింది. కాగా దాన్ని కాపాడేందుక ఎయిర్క్రాఫ్ట్, యుద్దం నౌకను రంగంలోకి దించింది. ఇదే విషయాన్ని భారత నేవీ శనివారం అధికారిక ప్రకటన చేసింది.
ప్రస్తుతం హైజాక్ గురైన నౌక నుంచి “డిసెంబరు 14 రాత్రి సమయంలో ఎంవీ రుయెన్ నౌక యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) పోర్టల్లో మేడే నౌకలోకి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారని ఓ సందేశం పంపింది. ఆ మెసేజ్ సారాంశం దీంతో భారత నేవీ వేగంగా స్పందించింది. అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న నావల్ మారిటైం పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది” అని నేవీ తెలిపింది.
కాగా హైజాక్కు గురైన ఆ నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. నౌకపై వారు నియంత్రణ కోల్పోయినట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. రుయెన్ నౌకకు సాయం చేసేందుకు భారత నేవీ విమానం, యుద్ధ నౌక అక్కడకు చేరుకున్నాయి. ప్రస్తుతం అది సోమాలియా తీరం దిశగా ప్రయాణిస్తోంది. దాని పైనుంచే నేవీ ఎయిర్క్రాఫ్ట్ ప్రయాణిస్తోంది. మరోవైపు, ఈ తెల్లవారుజామున భారత యుద్ధనౌక విజయవతంగా రుయెన్ నౌకను అడ్డగించినట్లు నేవీ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది.
గతంలోనూ కూడా ఈ తరహ 2017లో నౌక హైజాక్ లు జరిగాయి.
సోమాలియా పైరెట్లు నౌకలపై జరిపిన తొలి అతిపెద్ద దాడి ఇదే. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు యూకే నౌకాదళం హెచ్చరికలు పంపింది.
ఇది వరకే టర్కీ నుంచి భారత్ కు బయలుదేరిన ఒక రవాణా నౌక యెమెన్ కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో హైజాక్ కు గురైంది. అది మరువ ముందే.. అరేయా సముద్రంలో వాణజ్య నౌక హైజాక్ చేశారు.