Himalayan trekking : ఉత్తరాఖండ్ లోని హిమాలయ ట్రెక్కింగ్.. తొమ్మిది మంది మృతి

ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో హిమాలయా ట్రెక్కింగ్స్ (Himalayan trekking) చేస్తుంటారు. కాగా ఈ సంవత్సరం కూడా ఓ ట్రెక్కింగ్ బృదం.. హిమాలయన్‌ వ్యూ ట్రెక్కింగ్‌ ఏజెన్సీ మనేరికి చెందిన 22 మంది సభ్యుల బృందం మే 29న ఉత్తరకాశీ (Uttarkashi) నుంచి 35 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ ప్రారంభించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2024 | 12:14 PMLast Updated on: Jun 06, 2024 | 12:14 PM

Himalayan Trekking In Uttarakhand Nine People Died

ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని సహస్రతల్లో జరిగింది.

ఇక విషయంలోకి వెళ్లితే..
ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో హిమాలయా ట్రెక్కింగ్స్ (Himalayan trekking) చేస్తుంటారు. కాగా ఈ సంవత్సరం కూడా ఓ ట్రెక్కింగ్ బృదం.. హిమాలయన్‌ వ్యూ ట్రెక్కింగ్‌ ఏజెన్సీ మనేరికి చెందిన 22 మంది సభ్యుల బృందం మే 29న ఉత్తరకాశీ (Uttarkashi) నుంచి 35 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ ప్రారంభించింది. దక్షిణాది నుంచి.. ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో ట్రిక్కింగ్ వెళ్లారు. మార్గమధ్యంలో ప్రతికూల వాతావరణం కారణంగా సభ్యులు దారితప్పారు. హఠాత్తుగా మారిపోయింది. దీంతో వారు మంచులో తప్పిపోయారు. వీరిలో తొమ్మిది మరణించగా మరో 9 మంది జాడ తెలియలేదని అధికారులు తెలిపారు. ఇక మంచులో మొత్తం 21 మంది చిక్కుకోగా, 13 మందిని హెలికాప్టర్ల సహాయంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. సహస్రతల్‌ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో.. ట్రెక్కింగ్‌ చేస్తూ తొమ్మిది మంది మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అటవీ శాఖకు చెందిన 10 మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయలుదేరాయని పేర్కొన్నారు.

ఉత్తరకాశీ జిల్లా ఆసుపత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశామని, 14మంది రక్షణ సిబ్బంది, ఒక వైద్యుడిని ఘటనా స్థలానికి పంపామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్‌, అంబులెన్స్‌లను సిద్ధం చేశామన్నారు.