Kedarnath : హిమాలయాలు మంచుతో కప్పబడిపోయిన కేదార్ నాథ్ ఆలయ చిత్రాలు
కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం (పుణ్యక్షేత్రం). మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది.

కేధార్ నాథ్ ఆలయం..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న ప్రచీణ ద్వాదశ శివలింగం.

వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ఏప్రిల్ (అక్షయ తృతీయ), నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు దర్శనం చేసుకునేందుకు తెరిచి ఉంటుంది.

శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలలవరకు పూజలు నిర్వహిస్త్తారు.

ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి 26 కి.మీ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎత్తైన జలపాతాలను దాటుకుంటూ.. కష్టతరమైన లోయపు దారులు దాటుకుంకటు కేదార్నాథ్ ఆలయం చేరుకోవాలి.

హిందూ ఇతిహాసాల ప్రకారం, ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందన్ని స్థల పూరాణం చెప్తుంది.

భారత దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి.

ఉత్తర హిమాలయాల చోటా చార్ ధామ్ తీర్థయాత్ర లోని నాలుగు ప్రధాన ఆలయ.. ప్రదేశాలలో ఈ కేధార్ నాథ్ ఆలయం ఒకటి.

ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉంటుంది.

ఆరు నెలలు మంచుతో కప్పబడిన ఈ ఆలయ పరిసరాల్లో కేవలం ఆగోరాలు.. సన్యాసులు మాత్రమే ఉంటారు.

కేధార్ నాథ్ ఆలయం ఎదుట మహా శివరాత్రి కోసం సిద్ధం చేసిన మంచు లింగం..

కేదార్నాథ్ ఆలయం పరిసర ప్రాంతంలో పేరుకుపోయిన మంచు దుప్పటి.