టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అశ్విన్ తాజాగా హిందీ భాషపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీ గ్రాడ్యూయేషన్ వేడుకకు అశ్విన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ వేడుకలో హిందీ మన జాతీయ భాష కాదంటూ అశ్విన్ అనడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకలో మాట్లాడేముందు ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఎంత మందికి అర్థమవుతుంది అంటూ స్టూడెంట్స్‌ను అడిగాడు . తమిళంతో పాటు ఇంగ్లీష్ అర్థమవుతుందని చాలా మంది స్టూడెంట్స్ చేతులు ఎత్తారు. హిందీ భాష గురించి అశ్విన్ అడిగినప్పుడు కొందరు స్టూడెంట్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. స్టూడెంట్స్ రెస్పాన్స్ చూసిన అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదు...కేవలం అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమేనంటూ వ్యాఖ్యానించాడు. అశ్విన్ కామెంట్స్‌ను కొందరు అభిమానులు ట్రోల్ చేస్తోన్నారు. కానీ తమిళనాడు క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్ చేస్తోన్నారు. ఇలాంటి విషయాలపై అశ్విన్ లాంటి సెలబ్రిటీ ఆచితూచి మాట్లాడాలంటూ పలువురు సూచిస్తే... అభిప్రాయాలను చెప్పడంలో తప్పేముందంటూ మరికొందరు మద్ధతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి క్రికెటర్‌గా మారడంపైనా ఈ వేడుకలో అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను క్రికెటర్ గా రాణించలేనంటూ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు చాలా మంది అన్నారని , హార్డ్‌వర్క్‌తో వారికి సమాధానం చెప్పానని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.. స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే కొత్త విషయాల్ని ఎప్పుడూ తెలుసుకోవడం అలవరుచుకున్నానని చెప్పాడు. నేర్చుకోవడం ఆపేసిన రోజు మన ఎదుగుదల ఆగిపోతున్నది చెప్పుకొచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలోనే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.రెండో టెస్ట్ తర్వాత తుది జట్టులో తనకు ప్లేస్ దొరక్కపోవచ్చన్న క్లారిటీలో గుడ్ బై చెప్పేసినట్టు తర్వాత వెలుగులోకి వచ్చింది. కాగా అశ్విన్ ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నాడు. ఇటీవల జరిగిన మెగావేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.[embed]https://www.youtube.com/watch?v=ta07qNpv7zE[/embed]