Sindhu You tube Shorts: చెల్లిని పొట్టనపెట్టుకున్న అన్న పరువు పేరుతో ఇంత దారుణమా..
అన్న అంటే అమ్మానాన్నలో సగం అంటారు. అలాంటి అన్నే.. ఓ చెల్లిని పొట్టనపెట్టుకున్నాడు. పరువు పోతోందని.. ప్రాణం తీశాడు.

Hirilal killed Sindhu, a young girl from Khammam Kothagudem, who was making YouTube shorts
ఖమ్మం జిల్లాలో జరిగింది ఈ ఘటన. యూట్యూబ్ షార్ట్ వీడియోలు చేస్తూ.. బానిసైన చెల్లిని క్షణికావేశంలో హతమార్చాడో అన్న. తమది పరువుగల కుటుంబమని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టి తమను బజారుకీడ్చొద్దని చెల్లిని హెచ్చరించాడు. అయినా చెల్లెలు తన మాట వినకుండా వీడియోలు చేస్తుండడంతో కోపంతో ఊగిపోయి.. చంపేశాడు. ఇంట్లో ఉన్న రోకలి తీసుకుని చెల్లి తలపై కొట్టాడు. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు విడిచింది. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఈ ఘటన జరిగింది. రాజీవ్‌నగర్ తండాకు చెందిన అజ్మీరా శంకర్, దేవికి అమ్మాయి సింధు, హరి లాల్ సంతానం.
మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో సింధు నర్సుగా పని చేస్తోంది. హరిలాల్ పనులకు వెళ్లేవాడు. యూట్యూబ్ వీడియోల విషయంలో సింధు, హరిలాల్ మధ్య గతవారం గొడవ జరిగింది. యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోలన్నీ డిలీట్ చేయాలని, ఇకపై వీడియోలు చేయవద్దని హరిలాల్ హెచ్చరించాడు. ఇందుకు సింధు అంగీకరించలేదు. కోపంతో ఊగిపోయిన హరిలాల్.. ఇంట్లో ఉన్న రోకలిబండతో సింధు తలపై కొట్టాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. చందును అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఈ జనరేషన్ మీద ఎక్కువగా ఉంటోంది. చాలాసార్లు అది ప్రాణాల మీదకు కూడా తీసుకువస్తోంది. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే దానికి ఇలా ఆవేశాలతో ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నారు జనాలు.