shilpa shocking comments : చందు ఆత్మహత్య పై ఆయన భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
త్రినయని సీరియల్ ఫేమ్ జోడీ పవిత్ర జయరామ్-చంద్రకాంత్ ల మరణాలు ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేశాయి. గత ఐదు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లితో ఒక్కటి కావాలనుకుంది.

His wife Shilpa's shocking comments on Chandu's suicide
త్రినయని సీరియల్ ఫేమ్ జోడీ పవిత్ర జయరామ్-చంద్రకాంత్ ల మరణాలు ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేశాయి. గత ఐదు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లితో ఒక్కటి కావాలనుకుంది. కానీ విధి వారి తలరాతను వేరే విధంగా రాసింది. కారు ప్రమాదలో పవిత్ర మరణించగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డ చంద్రకాంత్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చందు భార్య చెప్పిన మాటలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి
చందు భార్య పేరు శిల్ప. 2015 లో వారివురికి వివాహం జరిగింది. స్కూల్ డేస్ నుంచే వాళ్ళ మధ్య ప్రేమ మొదలయ్యింది. తొలుత చందునే శిల్ప ని ప్రేమించమని వెంటపడ్డాడు. ఆ తర్వాత శిల్ప కూడా చందు ప్రేమకి ఓకే చెప్పింది. అలా 12 సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరకీ ఒక బాబు పాప కూడా ఉన్నారు. కొన్నాళ్ల వరకు చక్కగానే సాగిన వాళ్ల కాపురంలో చనిపోయిన పవిత్ర రాకతో కలతలు మొదలయ్యాయి. ఫలితంగా నాలుగు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య మాటలు కూడ లేవు. కేవలం పిల్లలతోనే కాంటాక్ట్ లో ఉండే వాడు. కానీ ఏ రోజుకైనా మారి తన దగ్గరకి వస్తాడు అని శిల్ప అనుకుంది. చనిపోయే ముందు కూడా చందు కి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంటికి రమ్మని బతిమాలింది కూడా. ఇప్పుడు శిల్ప చెప్పిన ఈ మాటలన్నీ హాట్ టాపిక్ గా నిలిచాయి
కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి, త్రినయని లాంటి సీరియల్స్ చందుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రముఖ సినీ, టీవీ నటి కరాటే కళ్యాణి తనకి చందు కి మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది.తనకు ఇక ఈ జన్మ చాలు. తాను చనిపోవడమే కరెక్ట్ అనే చందు మెసేజ్ ఉంది .ఇక బతికున్ననాళ్లు చంద్రకాంత్.. పవిత్ర కోసం శిల్పను పట్టించుకోలేదు.. ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు అని తెలుస్తోంది. చంద్రకాంత్ బతికుండగా ఆమెకు కష్టాలే.. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా బాధలే.. ఆమె కష్టం ఎవరికి రాకూడదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైన తను అర్థం చేసుకుంటాడని… తిరిగి వస్తాడన్న నమ్మకంతో బతికాను.. ఇప్పుడు ఆ నమ్మకం కూడ పోయింది.. పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు’ అంటూ శిల్ప ఎమోషన్ అయ్యింది. ఏది ఏమైనా ఐదు రోజుల వ్యవధిలో ఇండస్ట్రీలో ఇద్దరి మరణాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.