India: భారతదేశంలో ఇప్పటి వరకూ ప్రాంతాల పేర్లు మార్చిన చరిత్ర ఇదే..

ఇండియాలో ఊర్ల పేర్లు మార్చడం కొత్తేమీ కాదు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయమే. అసలు ఇప్పటి వరకూ ఏఏ ప్రాంతాల పేర్లను ఎలా మార్చారో తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 12:26 PMLast Updated on: Sep 07, 2023 | 12:26 PM

History Of Changing Names Of Regions In India

దేశాలు.. ప్రాంతాల పేర్లు మార్పు పై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. నిజానికి పేర్లు మార్చడం కొత్తేమీ కాదు.. ఆయా చారిత్రక అవసరాన్ని బట్టి మన దేశం లో చాలా రాష్ట్రాల పేర్లు మారాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయ్. రాష్ట్రాలకు ఇప్పుడున్న పేర్లే స్వాంతంత్రానికి పూర్వం లేవు. కొన్ని రాష్ట్రాలు, రాజధానుల పేర్లు మారాయ్.

భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయ్. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా  స్వాంతంత్రం వచ్చాక ఏర్పడ్డాయ్. మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌, యూపీ నుంచి ఉత్తరాఖండ్, బిహార్‌ నుంచి జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయ్. మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రం తర్వాత కాలంలో తమిళనాడుగా, మద్రాసు నగరాన్ని చెన్నైగా పిలుచుకుంటున్నారు. బెంగాల్‌ ప్రెసిడెన్సీ కాలక్రమేణ పశ్చిమ బెంగాల్‌గా.. కలకత్తా సిటీ కోల్‌కత్తాగా మారింది. అలాగే ఒరిస్సాను ఒడిషాగా, అస్సాంను అసోంగా మార్చేశాయ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

యునైటెడ్‌ ప్రావిన్సెస్ కాస్త ఉత్తరప్రదేశ్‌గా మారిపోయింది. త్రివేండ్రం నగరం తిరువనంతపురంగా, బాంబే ప్రెసిడెన్సీ స్టేట్‌ మహారాష్ట్రగా, బాంబే నగరం ముంబైగా మారిపోయాయ్. ఉత్తరప్రదేశ్‌ నుంచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు ఉత్తరాంచల్‌గా పెట్టారు. తర్వాత దాని పేరు ఉత్తరాఖండ్‌గా స్థిరపడిపోయింది. ట్రావెన్‌కోర్ సంస్థానం కాలక్రమేణా కొచ్చిన్‌గా, ఈస్ట్‌ పంజాబ్‌ పేరు పంజాబ్‌గా మారిపోయాయ్.
మైసూర్‌ స్టేట్‌ కాస్త.. కర్ణాటక బాంబే ప్రెసిడెన్సీగా కొంతకాలం పిలుచుకున్నారు. తర్వాత కర్ణాటకగా పేరు స్థిరపడింది. హైదరాబాద్‌ స్టేట్‌ను ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. నార్త్‌ ఈస్ట్ ఫ్రంటీయర్ ఏజెన్సీకి అరుణాచల్ ప్రదేశ్‌గా పిలుస్తున్నారు.