Mumbai Indians : ఇంకా కోపం తగ్గని హిట్ మ్యాన్ ఫాన్స్… ముంబై ఓటమితో సంబరాలు
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) అభిమానులకు ఇంకా కోపం తగ్గడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తమ కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ముంబై ఇండియన్స్ ప్రకటించింది.

Hitman fans who are still angry... celebrate Mumbai's defeat
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) అభిమానులకు ఇంకా కోపం తగ్గడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తమ కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ముంబై ఇండియన్స్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు. ఇక నుంచి జట్టుకు ఏ మాత్రం మద్దతు తెలుపమని బహిరంగంగానే ప్రకటించారు.ముంబై ఇండియన్స్ ఓటమిని కోరుకునేంతగా వారి ఆగ్రహం చేరింది. ఆ జట్టు ఓడితే సంబరాలు చేసుకునేంత కసితో ఉన్నారు.
తాజాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ఎలిమినేటర్‌లో ముగిసింది. ముంబై ఇండియన్స్ పరాజయం నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శర్మ, కర్మ అనే హ్యాష్ ట్యాగ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్‌కు సరైన గుణపాఠం తగిలిందని మండిపడుతున్నారు. రోహిత్ శర్మ అభిమానుల ఉసురు తాకి ఆ జట్టు మరింత నాశనం అవుతుందని శాపనార్దాలు పెడుతున్నారు. 2008 నుంచి 2012 వరకు ఒక్క కప్పులేని ముంబైకి రోహిత్ 2013 నుంచి గత సీజన్ వరకు ఐదు టైటిళ్లు అందించాడని గుర్తు చేస్తున్నారు.