HYDERABAD PARKING: విదేశాలకు ధీటుగా.. హైదరాబాద్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్
హైదరాబాద్‌లో వాహనదారులకు పార్కింగ్ అతిపెద్ద సమస్య అనే సంగతి తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ పలు ప్రయత్నాలు చేస్తున్నా.. ఏవీ సత్ఫలితాల్నివ్వడం లేదు. అందుకే అధునాతన మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌ను అందుబాటులోకి తేనుంది.

HYDERABAD PARKING: పెద్ద పెద్ద బిల్డింగుల్లోని ఫ్లోర్లలో మల్టీ లెవల్ పార్కింగ్‌ను విదేశాల్లోనే చూసి ఉంటారు. అయితే, ఇకపై ఇలాంటి పార్కింగ్ మన దగ్గరే అందుబాటులోకి రానుంది. అది కూడా హైదరాబాద్, నాంపల్లిలో. ఈ పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తే అక్కడ పార్కింగ్ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో వాహనదారులకు పార్కింగ్ అతిపెద్ద సమస్య అనే సంగతి తెలిసిందే.
MEGASTAR CHIRANJEEVI: ఏపీ ప్రచారంలో మెగాస్టార్.. ఇక మామూలుగా ఉండదు..
ఈ సమస్యకు పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ పలు ప్రయత్నాలు చేస్తున్నా.. ఏవీ సత్ఫలితాల్నివ్వడం లేదు. అందుకే అధునాతన మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌ను అందుబాటులోకి తేనుంది. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్‌కు సమీపంలో, హెచ్‌యంఆర్‌కు చెందిన అర ఎకరం స్థలంలో ఈ పార్కింగ్ నిర్మిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్). 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. దీనిలో మొత్తం 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు పార్క్ చేసే వీలుంటుంది. మిగిలిన ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్ర్కీన్‌లతో కూడిన ఒక థియేటర్ కూడా ఉంటుంది.
పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టుని రూ. 80 కోట్లతో నిర్మించారు. ఇది పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్. జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో.. ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పార్కింగ్ నిర్మాణం దాదాపు పూర్తైంది. అతి త్వరలోనే వినియోగంలోకి వస్తుందని HMRL ఎండీ ఎన్వీయస్ రెడ్డి వెల్లడించారు.