Titanic: టైటానిక్ మునిగిన ప్రాంతం అత్యంత భయానక ప్రదేశం..
టైటానిక్‌ను చూసేందుకు సబ్‌మెరైన్‌లో వెళ్లిన ఐదుగురు బిలియనీర్ల కథ విషాదాంతమైంది. నీటి పీడనం ఒత్తిడికి సబ్‌మెరైన్ పేలిపోయింది. అందులో ఉన్న ఐదుగురు బిలియనీర్లు జలసమాధి అయిపోయారు.

Hollywood film director James Cameron said that the area where the Titanic sank is the most terrifying place
దీంతో టైటానిక్ మునిగి ఉన్న ప్రాంతం గురించి జేమ్స్ కేమరూన్ చెప్పిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. టైటానిక్ సినిమా తీసిన కామెరూన్ పసిఫిక్ మహాసముద్రంలో ఆ షిప్ మునిగిన ప్రాంతానికి 33 సార్లు వెళ్లారట. మొదటి సారిగా రష్యన్ సబ్ మెరైన్‌లో ఆ ప్రాంతానికి ఆయన వెళ్లి ఓ డాక్యుమెంటరీ వీడియో తీశారట. ప్రపంపంలోనే అత్యంత క్రూరమైన ప్రాంతాల్లో టైటానిక్ మునిగిన ప్రాంతం కూడా ఒకటని కామెరూన్ చెప్పారు. టైటానిక్ సినిమా తీసినదానికంటే ఆ ప్రాంతాన్ని చూడటమే చాలా అద్భుతంగా అనిపించిదని చెప్పారు.
సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చాలా సినిమాలకు ఆ ప్రాతం క్రూరత్వమే ప్రేరణ అంటూ చెప్పారు కామెరూన్. మునిగిపోయిన టైటానిక్‌ను తాను స్వయంగా చూస్తున్నప్పుడు ప్రపంచంలో తాను ఒక్కడినే ఉన్నానన్న ఫీలింగ్ కలిగిందని కామెరూన్ చెప్పారు. దాదాపు 13 వేల కిలోమీటర్ల లోతులో ఉన్న ఆ షిప్‌ను చూడటం నిజంగా ఓ అద్భుతమంటూ చెప్పారు. ఆ కారణంగానే తాను ఏకంగా 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు చెప్పాడు. కానీ అదే ప్రాంతంలో అదే అనుభూతిని పొందేందుకు వెళ్లిన ఐదుగురు బిలియనీర్లు ప్రమాదవశాత్తూ చనిపోవడం విషాదకరం.