Hyderabad Home voting : హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో.. నేడు, రేపు హోం ఓటింగ్

తెలంగాణలో ప్రారంభంమైయిన హోం ఓటింగ్ (Home voting).. హైదరాబాద్ లో పార్లమెంట్ (Parliament) పరిధిలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 3, 2024 | 12:22 PMLast Updated on: May 03, 2024 | 12:22 PM

Home Voting In Hyderabad Parliament Today And Tomorrow

 

 

 

తెలంగాణలో ప్రారంభంమైయిన హోం ఓటింగ్ (Home voting).. హైదరాబాద్ లో పార్లమెంట్ (Parliament) పరిధిలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేడు రేపు హోం ఓటింగ్ జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 121మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 86 మంది సీనియర్స్ సిటిజన్స్, 35 మంది దివ్యాంగులు ఉన్నారు. శుక్ర, శనివారం ఉదయం 7:30నుంచి సాయంత్రం 5గంటల వరకు హోం ఓటింగ్ ఉంటుంది. కాగా, ఓటర్లు అందరూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి చెప్పారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా (హోం ఓటింగ్) కు ఇంటింటికి ఓటు వేసేందుకు 23,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల అధికారులు ఇంటి ఓటింగ్‌ను 806 గ్రూపులుగా.. 885 రూట్లుగా విభజించారు. ప్రతి బృందంలో పోలింగ్ అధికారులతో పాటు వీడియో చిత్రీకరణ బృందం ఉంటుంది. ఈ నెల 6 గంటలలోగా ఇంటింటికి ఓటింగ్‌ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

SSM