Mathura Nagar : ఘోరం.. కుక్క ఇంట్లోకి వచ్చిందని.. భార్య, భర్తలపై దాడి..
హైదరాబాద్లో దారుణం సంఘటన మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ మొదలై.. వారి పై దాడి చేసే వరకు వెళ్లింది.

Horrible.. The dog came into the house.. Attack on wife and husband..
హైదరాబాద్లో దారుణం సంఘటన మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ మొదలై.. వారి పై దాడి చేసే వరకు వెళ్లింది.
ఇక విషయంలోకి వెళితే..
హైదరాబాద్ లో దారణం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని మధురానగర్ లో కుక్క విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ చెలరేగి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిన ఘటన HYD రహమత్నగర్లో జరిగింది. శ్రీనాథ్ పెంపుడు కుక్క ఈ నెల 8న బెల్ట్ తెంచుకుని ఎదురుగా ఉన్న ధనుంజయ్ ఇంటికి వెళ్లింది. ఆ రోజు గొడవ జరగ్గా.. పగ పెంచుకున్న ధనుంజయ్ మరో ముగ్గురితో కలిసి ఈ నెల 14న కుక్క యజమాని శ్రీనాథ్ తో పాటు ఇంటిల్లిపాదిని కొందరు యువకులు చితకబాదారు. కర్రలతో దాడి చేశాడు. అడొచ్చిన అతని భార్య స్వప్నను, కుక్కనూ ఘోరంగా కొట్టారు. శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వారి పెంపుడు కుక్కకు తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, బాధితుడు శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Suresh SSM