Tripti Dimri : త్రిప్తి డిమ్రి మరీ ఇంత బ్యాడా
అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఒక్క అనిమల్ సినిమాతో మాత్రం ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. అమ్మడి అందానికి పాన్ ఇండియా లెవల్లో ఫిదా అయ్యారు.

Hot beauty Tripti Dimri got overnight stardom with just one movie Animal.
అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఒక్క అనిమల్ సినిమాతో మాత్రం ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. అమ్మడి అందానికి పాన్ ఇండియా లెవల్లో ఫిదా అయ్యారు. ఎంతలా అంటే.. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మికనే అయినప్పటికీ.. త్రిప్తి గురించే ఎక్కువగా చర్చ జరిగింది. అమ్మడి గ్లామర్ ట్రీట్ అలా ఉంది మరి. అయితే.. యానిమల్ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అయింది త్రిప్తి. ఈ క్రమంలో భారీ ఆఫర్స్ అందుకుంటోంది. కానీ.. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో మాత్రం ఓవర్ డోస్ ఇస్తోంది.
అరకొర అందాలు కాదు.. ఘాటైన అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్‌గా తను నటిస్తున్న బ్యాడ్ న్యూజ్ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు చూస్తే.. అమ్మడి ఎక్స్‌పోజింగ్ కాస్త ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విక్కీ కౌశల్‌తో హద్దులు చెరిపేసి రెచ్చిపోయినట్టుగా ఉంది. రొమాన్స్‌లో చెలరేగిపోయిన త్రిప్తి, అతడితో బెడ్ రూమ్ సన్నివేశాల్లోను సెగలు పుట్టించింది. ఇక లిప్ లాక్‌లకైతే లెక్కేలదు అన్నట్టుగా ఉంది.
ఓ రకంగా చూస్తే.. ఈ సినిమా త్రిప్తికి బోల్డ్ బ్యూటీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేలా ఉంది. అమ్మడి ఓవర్ డోస్ చూస్తే.. బ్యాడ్ న్యూజ్ సినిమా బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసేలా ఉంది. యానిమల్‌లోను అలాంటి పాత్రలోనే కనిపించింది కాబట్టి.. ఇప్పుడు బ్యాడ్ న్యూజ్‌తో అలాగే కంటిన్యూ అయితే.. త్రిప్తికి అలాంటి అవకాశాలే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి.. ఇప్పటికైనా తన క్రేజ్‌ను సరిగ్గా వాడుకుంటే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బ్యాడ్ న్యూజ్ ఎలా ఉంటుందో చూడాలి.