50 ఏళ్ళ క్రితం చిరంజీవి ఒరిజినల్ పేరు ఎలా రాసారంటే
మెగాస్టార్ చిరంజీవి” తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలో ఒక బ్లాస్టింగ్ నేమ్. చిరంజీవి పేరు వింటే మాస్ ఆడియన్స్ పూనకాలు పీక్స్ లో ఉంటాయి. హీరోలు అంటే అప్పటి వరకు నటన మాత్రమే అనే మాట దగ్గరి నుంచి హీరోలు అంటే కళ్ళు చెదిరే డాన్స్ కూడా ఉంటుందని ప్రూవ్ చేసిన డైనమిక్ హీరో.
మెగాస్టార్ చిరంజీవి” తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలో ఒక బ్లాస్టింగ్ నేమ్. చిరంజీవి పేరు వింటే మాస్ ఆడియన్స్ పూనకాలు పీక్స్ లో ఉంటాయి. హీరోలు అంటే అప్పటి వరకు నటన మాత్రమే అనే మాట దగ్గరి నుంచి హీరోలు అంటే కళ్ళు చెదిరే డాన్స్ కూడా ఉంటుందని ప్రూవ్ చేసిన డైనమిక్ హీరో. చిరంజీవి చూడని రికార్డులు, చేయని సినిమాలు లేవు. ఎలాంటి పాత్రలో అయినా సరే చిరంజీవి తన నటనతో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేయగలిగే సామర్ధ్యం ఉన్న నటుడు. ఇండియన్ సినిమాలో హీరోలు డాన్స్ అంటే చిరంజీవి గుర్తుకు వస్తారు.
ఇప్పుడు 7 పదుల వయసు దగ్గర పడుతున్నా చిరంజీవిలో స్పీడ్ మాత్రం తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతూ మాస్ ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నాడు చిరూ. విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమాతో త్వరలోనే ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా సంక్రాంతి తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య సినిమా ఫ్లాప్ అయినా చిరంజీవి ఎక్కడా స్పీడ్ తగ్గించలేదు. యువ డైరెక్టర్ లకు కూడా తన కోసం మంచి కథ తెస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తా అని సవాల్ చేస్తున్నారు.
ఇక ఫిట్నెస్ విషయంలో కూడా చిరంజీవి యువ హీరోలకు సవాల్ చేయడం షాకింగ్ విషయం. చిరంజీవి సినిమాల్లోకి రాకముందు చిరంజీవి కాదు.. ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. 1978 చిరంజీవి ప్రాణం ఖరీదు చిత్రంతో నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇలా అప్పటి విషయాలను పంచుకుంటూ చిరంజీవి తన సోషల్ మీడియా ఎకౌంటు లో ఓ పోస్ట్ చేసారు. “డిగ్రీ చదువుకునేటప్పుడు నర్సాపూర్ వైఎన్ఎం కాలేజ్ లో రంగస్థలం మీద రాజీనామా అనే తొలి నాటకం వేశాను. నటుడిగా తొలి గుర్తింపు వచ్చింది.
అది బెస్ట్ యాక్టర్‌ను చేయడంతో పాటు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించింది. 1974 -2024: 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం” అని ఆయన పోస్ట్ చేసారు. దీనికి అప్పటి తన పాత ఫొటోను ఆయన పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ప్పటికి ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆ ఫోటో పై కాలేజీ యాజమాన్యం.. Mr. K. S. S. V. Prasada Rao, B.com, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది కాలేజ్ 1974-75 అని రాసి ఉంది. ఈ ఫోటోని ఫ్యాన్స్ ప్రొఫైల్ పిక్స్ పెట్టడం గమనార్హం.