Anant Ambani : సన్నగా ఉండేవాడు ఎలా లావు అయ్యాడు.. ఆరోగ్య సమస్యలే కారణమా.. అనంత్ ఎలాంటోడు..
అపర కుబేరుడు, దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్.. పెళ్లి వేడుకలు నభూతో అనే రేంజ్‌లో జరుగుతున్నాయ్. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి మరీ.. ముద్దుల చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నాడు ముఖేష్ అంబానీ.

How did a thin person become fat.. Is it due to health problems.. Ananth says..
అపర కుబేరుడు, దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్.. పెళ్లి వేడుకలు నభూతో అనే రేంజ్‌లో జరుగుతున్నాయ్. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి మరీ.. ముద్దుల చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. వాల్డ్‌వైడ్‌గా ప్రముఖులంతా.. ఈ పెళ్లికి హాజరవుతున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా.. అనంత్ మ్యారేజీ (Anant Marriage) వేడుక రికార్డు చేయనుంది. ఐతే అనంత్ విషయంలో చాలామంది చాలా అనుమానాలు ఉన్నాయ్.
ఆ మధ్య ఓ వీడియో వైరల్ కావడం.. సన్నగా మారి మళ్లీ లావు కావడం.. అసలు రాధిక మర్చంట్ ఎవరు.. ఇలా చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయ్. ఐతే అనంత్ జీవితంలోకి ఒక్కసారి తొంగిచూస్తే అతని కేరక్టర్ ఏంటో తెలుస్తుంది. అతను ఎంత మంచోడో అర్థం అవుతుంది. అదే సమయంలో అతనికి ఉన్న ఆరోగ్య సమస్యలు.. కొడుకును కాపాడుకునేందుకు తల్లి పడుతున్న కష్టం తెలిస్తే.. తెలియకుండానే కళ్లు తడి అవుతాయ్. అనంత్ అంబానీకి జంతువులు అంటే ప్రాణం. అతని చిన్నప్పుడు.. మండుటెండల్లో నడుస్తున్న ఏనుగును చూసి.. మనసు కదిలింది. జంతువులను కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు.
దీనికోసం గుజరాత్ జామ్‌నగర్ (Gujarat Jamnagar) లో రిలయన్స్ (Reliance) రిఫైనరీ కాంప్లెక్స్ 3వేల ఎకరాల్లో కృత్రిమ అడవి నిర్మించేశాడు. వంతారా పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని వెనక ఆలోచన అనంత్ అంబానీదే. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం ఈ ఫౌండేషన్ టార్గెట్. వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటుచేశారు.
ఈ అడవిలో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. అధునాతన వైద్య సదుపాయాలతో పశువైద్యులు, పోషకాహార నిపుణులు, రోగనిర్ధారణ నిపుణులతో కూడిన ఈ కేంద్రంలో 5వందల మంది సిబ్బంది, 2 వందల ఏనుగులను చూసుకుంటుంటారు. 2వేల0 కంటే ఎక్కువ జంతువులకు ఇందులో ఆశ్రయం ఇస్తున్నారు. 43విభిన్న జాతులను కాపాడుతుంటారు. జంతువుల విషయంలోనే ఇంత ప్రేమతో ఉండే అనంత్ అంబానీ.. గుణం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నది నెటిజన్ల మాట. అంబానీకి వారసుడు అయినా.. డౌన్ టు ఎర్త్ ఉంటాడు అంబానీ. పెళ్లి కోసం పనిచేసిన అందరికీ స్వయంగా వడ్డించి.. తన కేరక్టర్ ఏంటో చూపించాడు.
ఇక అనంత్ ఆరోగ్యంపై తల్లి నీతా ఎప్పుడూ శ్రద్ధ తీసుకుంటుంది. అనంత్‌కు ఆస్తమా సమస్య ఉంది. దానిని కంట్రోల్ చేసేందుకు స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఈ స్టెరాయిడ్స్‌తో విపరీతమైన ఆకలి పెరుగుతుంది. దీంతో వారు వ్యాయామాలు కూడా చేయడానికి ఇబ్బందులు పడతారు. ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. అనంత్ విషయంలో అదే జరిగింది. 2016లో చాలా సన్నగా కనిపించిన అనంత్.. ఆ సమయంలో పెద్దగా బయటికి కనిపించలేదు. ఆ తర్వాత మళ్లీ విపరీతంగా లావయ్యారు. రాధికా మర్చంట్‌తో రోకా సెర్మనీ, నిశ్చితార్థ వేడుక సమయాల్లో ఇది స్పష్టంగా అర్థమైంది.