ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులకు సమాచారం అందడంతో నందిగామ ఏసీపి తిలక్ ఆద్వర్యంలో భీమవరం టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు పోలీసులు. టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిఘాతో తిరిగి కారు విజయవాడ వైపు వెళ్ళింది. విజయవాడ నుండి హైద్రాబాద్ వైపు ఈ కారు ప్రయాణిస్తుందని గుర్తించారు. వేగంగా కారు తిప్పడంతో అనుమానించి కార్ ను పోలీసులు చేజ్ చేసారు. గౌరవరం సమీపంలోని పొలాల్లో కార్ ను వదిలి దుండగులు పరారు అయ్యారు. కార్ డిక్కీ తెరచి చూడగా గంజాయని భారీగా గుర్తించారు. కార్ డిక్కీలో సుమారుగా 70 కిలోల గంజాయి ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. విశాఖ నుంచి ఈ గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్టు గుర్తించారు. [embed]https://www.youtube.com/watch?v=rQwTfQH4GSQ[/embed]