Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..?

జపాన్ (Japan) దేశాన్ని మరోసారి భూకంపం కుదిపేసింది. టెక్నాలజీలో అందరికన్నా ముందున్న జపాన్ దేశంలో భూకంపాలు (Earthquake) రావడం అనేది సర్వ సాధారణం.. కాగా నేడు ఉదయం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపాలు(EARTH QUAKE) సంభవించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 3, 2024 | 12:37 PMLast Updated on: Jun 03, 2024 | 12:37 PM

Huge Earthquake In Japan Tsunami Warnings

 

 

జపాన్ (Japan) దేశాన్ని మరోసారి భూకంపం కుదిపేసింది. టెక్నాలజీలో అందరికన్నా ముందున్న జపాన్ దేశంలో భూకంపాలు (Earthquake) రావడం అనేది సర్వ సాధారణం.. కాగా నేడు ఉదయం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపాలు(EARTH QUAKE) సంభవించాయి. ఇవాళ ఉదయం సెంట్రల్ జపాన్లో (సోమవారం) భారీ భూకంపం సంభవించింది. 5.9 తీవ్రతతో నోటో ద్వీపకల్పంలో ఉత్తర కొన పై మొదటి ప్రకంపన, అనంతరం మరో పది నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో మరో ప్రకంపన వచ్చినట్టు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో నగరంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురైన ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుత సమాచారం మేరకు జపాన్ కు ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. దీంతో సెంట్రల్ జపాన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉదయం సంభవించిన భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. పెద్దగా ఆస్తి నష్టాలు జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావంతో.. రైల్వే వ్యవస్థలో కొంత నష్టం జరిగినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. కాగా ప్రస్తుతం సెంట్రల్ జపాన్ లో రైల్వే ప్రయాణాలు తాత్కాలికంగా మూసివేశారు. రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ లను పరిశిలించి.. ఆ తర్వాత ఆస్తి నష్టంపై అంచాని వెశి.. తిరిగి రైల్వే ప్రయాణాలు పుణ‌ర్ ప్రరంభం కానున్నాయి.

మరోవైపు ఈ భూ ప్రకంపనలు సమీపంలోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లలో (Nuclear power plants) స్వల్ప నష్టం వాటిల్లినట్టు తెలిపారు. నోటో లోని షికా ప్లాంట్‌కు మాత్రం కొద్దిగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. కాగా ఈ ఏడాది మొదట్లో ప్రపంచ వ్యాప్తంగా న్యూయర్ వేడుకలు జరుపుకుంటున్న కొత్త సంవత్సానికి వెల్ కమ్ చెపుతుంటే… జపాన్ లో మాత్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 1న ఈ ప్రాంతంలో పెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి దాదాపు 230 మంది దుర్మరణం పాలయ్యారు.