Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ఒకే సారి వేర్వేరు ప్రాంతంల్లో ఎన్ కౌంటర్
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి.

Huge encounter in Jammu and Kashmir... Encounter in different areas at the same time
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి. జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలోని కుల్గాం జిల్లాలోని ఫ్రిసల్ చిన్నిగాం, మోడెర్గాం గ్రామాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో.. భద్రతాబలగాలు కూల్గాం జిల్లాలో సైన్యం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. ఈ క్రమంలో భారత సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భారత సైనికులు వీరమరణం పొందారు.
దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో టెర్రరిస్టులు ఉన్నారని ఆర్మీకి సమాచారంతో మోడెర్గామ్ గ్రామంలో సీఆర్ పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. టెర్రరిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో ఒక సైనికుడు, నలుగురు టెర్రరిస్టులు మరణించారు. మరో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం.. దీంతో ఆ రెండు చోట్లా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని భారత సైనికులు వెల్లడించారు.