Visakhapatnam fishing harbor : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 40 బోట్లు మంటల్లో బుడిద.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరగింది. నిన్న రాత్రి ఓ బోటులో మంటలు చెలరేగడమే ఈ ప్రమాదానికి కారణం. రాత్రి సమయంలో చేపల కు కపలగా బోట్లలో నిద్రపోతున్న వారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో బోట్లలో ఎవరు లేకపోవడం.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానికులు వెలడించారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరగింది. నిన్న రాత్రి ఓ బోటులో మంటలు చెలరేగడమే ఈ ప్రమాదానికి కారణం. రాత్రి సమయంలో చేపల కు కపలగా బోట్లలో నిద్రపోతున్న వారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో బోట్లలో ఎవరు లేకపోవడం.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానికులు వెలడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. విశాఖపట్నం పోర్టు అథారిటీ నుంచి ప్రత్యేకమైన అగ్నిమాపక నౌకను రప్పించారు.. హుటాహుటిన ఫిషింంగ్ హార్బన్ కు అయిన ఘటనాస్థలానికి చేరుకుని నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు.
Cargo Ship, Hijack : ఇండియాకు వస్తున్న కార్గో షిప్ హైజాక్..
నిన్న అందరూ చేపల వేటకు అయి సముద్రంలోకి వేళ్లి వచ్చే సరికి అర్థరాత్రి అవ్వటంతో రాత్రి సమయంలో బోట్లు వేట ముగించుకొని తీరానికి చేరుకున్నాయి. ఇక మరికొన్ని బోట్లు అప్పుడే డీజిల్ నింపుకొని వేటకు సిద్ధమవుతున్నాయి. డీజిల్ నింపే సమయంలో ఉన్నట్టుండి ఓ బోటు లో మంటలు చెలరేగాయి. బోటుల్లో అప్పుడే డీజిల్ నింపడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పాటు చాలావరకు పోర్టులో ఫైబర్ బోట్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దాంతో బోట్లన్నీ ఒకదాని ఒకటి మంటలు అంటూ కుంటూ మంటల్లో కాలి బుడిదయ్యాయి. ఈ ఘటనలో మంటలు దాదాపు 60 బోట్లకు వ్యాపించగా.. అందులో 40 నుంచి 50 బోట్లు పూర్తిగా మంటలకు దగ్ధమయ్యాయి. దీంతో పాటూ వేట నుంచి తీసుకొచ్చిన మత్స్యసంపద కూడా బూడిదపాలైంది. ఈ ప్రమాదంలో దాదాపు 30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
స్థానికుల అనుమానాలు..!
అయితే ఇది ఆకతాయిల పనే అంటున్నారు స్థానికులు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించారని.. స్థానికులు అనుమానిస్తున్నారు.