Union Budget 2024-25 : కేంద్ర బడ్జెట్ లో భారీగా ధరలు తగ్గింపు.. వేటిపైనో తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వరుసగా 7వ సారి విజయవంతంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారమన్.
కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వరుసగా 7వ సారి విజయవంతంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారమన్. ఈ సందర్భంగా పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఎలక్ట్రానిక్ డివైజ్, బంగారం, మత్స్య సంపద.. పై భారీగా ధరలు తగ్గినట్లు తెలుస్తోంది.
2024-25 కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 15%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారమన్.. పార్లమెంట్ లో బడ్జెట్ పై ఆమె ప్రసంగిస్తూ.. మొబైల్ ఫోన్‌లు, సంబంధిత భాగాలు.. ఛార్జర్‌ల.. సోలార్ ప్యానెళ్లు.. లెదర్, టెక్స్‌టైల్.. చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు. ధరలు భారీగా తగ్గుతున్నాయని తెలిసింది. ఇదే కాక క్యాన్సర్ మందులు, వైద్య పరికరాలు, బంగారం, వెండి, ప్లాటినం పై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో రేపు రేపు గోల్డ్ మార్కెట్లో బంగారం, వెండి, ప్లాటినం తక్కువ ధరలే కొనుగోలు చేసుకోవచ్చు.. మరో వైపు మత్స్య సంపద అయిన సముద్ర ఆహారం.. పై కూడా భారీగా ధరలు తగ్గుతున్నాయి. రొయ్యలు, చేపల ధరలు కూడా తగ్గవచ్చు అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమ్మోనియం నైట్రేట్, PVC ఫ్లెక్సీ బ్యానర్ల, కొన్ని టెలికాం పరికరాలు వాటి కస్టమ్స్ డ్యూటీని పెంచినందు వల్ల వాటి ధర మరింత పెరుగుతుంది ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.