Chiru : విశ్వంభర’ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం భారీ సెట్‌?

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara). చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2024 | 11:00 AMLast Updated on: Mar 18, 2024 | 11:00 AM

Huge Set For Vishwambhara Action Sequence

 

 

 

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara). చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత చిరు సోషియో ఫాంట‌సీ మూవీలో న‌టిస్తుండ‌డంతో.. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మెగాస్టార్ కెరీర్ లోనే ఒక మెగా స్పెషల్ చిత్రంగా నిలిచేలా రెడీ అవుతున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ గురించి వినిపిస్తున్న ఓ క్రేజీ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

విశ్వంభ‌ర‌లో మెగాస్టార్ తో విజ్యువల్ వండర్ చేయబోతున్నాడట వ‌శిష్ట‌.. దీనికి త‌గ్గ‌ట్లుగానే ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే వచ్చిన ప్రీ లుక్ పోస్టర్స్. టైటిల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినియా సోషియో ఫాంటసీ మూవీ కోసం రకరకాల సెట్స్ ను ప్లాన్ చేశారు మూవీ టీమ్. అందుకు తగ్గట్టగానే భారీగా ఖర్చు చేస్తూ.. ఓ కొత్త ప్రపంచాన్ని సెట్ రూపంలో వేయబోతున్నాడట వశిష్ట.. కాగా ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం ఓ భారీ సెట్ వేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సెట్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది.

విశ్వాంతరాళంలో జరిగే కథ కాబట్టి ఆ స్థాయిలో భారీ సెట్లు అవసరం అని తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి చిత్రాల తర్వాత ఆ జోనర్ లో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం ఇదే కావ‌డంతో హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. సెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని చెప్పాడు. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో యువీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి, కీరవాణి (Keeravani) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మ్యూజిక్‌పైనా భారీ అంచ‌నాలు ఉన్నాయి. చూడాలి మ‌రి.. విశ్వంభ‌రగా చిరు చేయ‌బోయే ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో..