JAGANNADH KHAJANA : వందల టన్నుల్లో వజ్ర వైఢూర్యాలు.. లక్షల కోట్ల సంపద లెక్క తేలుతుందా ?
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఖజానాలో వందల టన్నుల్లో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయట. లక్షల కోట్ల విలువైన ఆ సంపదను 46 యేళ్ళ తర్వాత మళ్ళీ లెక్కించబోతున్నారు. ఆ శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో లెక్కించలేనంత సంపద ఉందని అంటున్నారు. ఎంతో విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి... రహస్య గదిలో భద్రపరిచారు పూర్వీకులు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఖజానాలో వందల టన్నుల్లో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయట. లక్షల కోట్ల విలువైన ఆ సంపదను 46 యేళ్ళ తర్వాత మళ్ళీ లెక్కించబోతున్నారు. ఆ శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో లెక్కించలేనంత సంపద ఉందని అంటున్నారు. ఎంతో విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి… రహస్య గదిలో భద్రపరిచారు పూర్వీకులు. గతంలో అప్పుడప్పుడు ఆ సీక్రెట్ రూమ్స్ తెరిచి లెక్కించేవారు. కానీ 1978 తర్వాత జగన్నాథుడి అమూల్యమైన ఖజానాను ఇప్పటివరకూ తెరవలేదు.. లెక్కపెట్టలేదు. ఈ జులై 14న ఆ రహస్య గది తాళాలు తెరుచుకోబోతున్నాయి. ఆభరణాలను లెక్కపెట్టడంతో పాటు… ఆ సీక్రెట్ రూమ్స్ కి అవసరమైన రిపేర్లు కూడా చేయబోతున్నారు. భాండాగారాన్ని తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సమావేశమై సంపదను లెక్కపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.
జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేథిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు వేలల్లో ఉన్నాయి. వీటి బరువు, నాణ్యత పరిశీలించడానికి చాలామంది నిపుణులు కావాలి. అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీని కూడా వాడబోతున్నారు. అంతేకాదు… ఆభరాణాల లెక్కింపు సమయంలో సంఘం సభ్యులంతా పూర్తిగా శాకాహారమే తినాలి. నియమ నిష్టలు పాటించాలి. 1978లో చివరిసారిగా జగన్నాథుడి ఆభరణాలను లెక్కించారు. అప్పుడు ఐదు కర్రపెట్టెల్లో భద్రపరిచారు. అప్పట్లో ఈ ఆభరణాలు లెక్కించడానికి 70 రోజులు పట్టింది అంటే… ఎంత సంపద ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా కొన్నింటిని లెక్క పెట్టే ఓపిక లేక వదిలేశారట.
ఆభరణాల లెక్కింపుపై గతంలోనే ఒడిశా హైకోర్టు ఆదేశాలివ్వగా, సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. విలువైన సంపద దాచిన రహస్య గదుల్లో వర్షపు నీళ్ళు చేరడంతో… గోడలు పాడైపోతున్నాయి. అందుకే 2018లోనే రిపేర్లు చేయాలని పురావస్తు శాఖ భావించింది. 2019లో 13 మంది ఉన్న కమిటీ సభ్యులు తలుపులు తెరిచేందుకు లోపలికి వెళ్ళారు. కానీ సీక్రెట్ రూమ్ కీ కనిపించలేదు. దాంతో రిపేర్లు కూడా ఆగిపోయాయి. దాని డూప్లికేట్ కీ పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్టు తర్వాత గుర్తించారు. ఈమధ్య జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్నాథుడి ఖజానా తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో 46 యేళ్ళుగా తెరుచుకోని జగన్నాథుడి రహస్య భాండాగారం తలుపులు తీయబోతున్నారు.