Madhavilatha : మాధవీలతది బిల్డప్పేనా ?
హైదరాబాద్ (Hyderabad) బీజేపీ (BJP) అభ్యర్థి మాధవీ లత (Madhavi Latha) అంతన్నారు. ఇంతన్నారు. చివరికి అంతే లేకుండా పోయారు. ఇరగదీసేస్తున్నాం... చరిత్ర సృష్టించబోతున్నాం... వాళ్ళ కోటను బద్దలు కొట్టబోతున్నామని బిల్డప్‌ల మీద బిల్డప్‌లు ఇచ్చేశారామె.
హైదరాబాద్ (Hyderabad) బీజేపీ (BJP) అభ్యర్థి మాధవీ లత (Madhavi Latha) అంతన్నారు. ఇంతన్నారు. చివరికి అంతే లేకుండా పోయారు. ఇరగదీసేస్తున్నాం… చరిత్ర సృష్టించబోతున్నాం… వాళ్ళ కోటను బద్దలు కొట్టబోతున్నామని బిల్డప్‌ల మీద బిల్డప్‌లు ఇచ్చేశారామె. కానీ… వాస్తవంలోకి వచ్చేసరికి చతికిలపడిపోయారు మాధవీ లత. అసలు ఆమెకు అంత హైప్ ఎందుకు వచ్చింది? రియాలిటీలో ఓటర్లు ఆమెను ఎందుకు నమ్మలేదు. టీవీల్లో ఇంటర్వ్యూలకి వచ్చిన రేటింగ్స్ చూసి ఇక తనకు లేదని మాధవీ లత అనుకున్నారా
మాధవీలత… లోక్‌సభ ఎన్నికల టైంలో తెలంగాణలో తాజా సంచలనం. ఓ రేంజ్‌లో ఎలివేషన్స్, అంతకు మించి సోషల్ మీడియా ప్రచారం. అబ్బో… ఇంకేముంది. పాతబస్తీలో మజ్లిస్ కోట బద్దలైనట్టే…మేడమ్ హైదరాబాద్ ఎంపీ అయిపోయినట్టేనంటూ బీభత్సమైన బిల్డప్‌లు ఇచ్చారు. అయితే… అదంతా ప్రచారంలో మాత్రమే. వాస్తవానికి వచ్చేసరికి అంతా తూచ్ అన్నారు ఓటర్లు. బీజేపీ తరపున పోటీ చేసిన మేడమ్ ఓడిపోయారు. ఎంఐఎం అధ్యక్షుడు, ఆ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఘన విజయం సాధించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే…. అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పోటీ చేసిన ప్రతిసారి ఆయన మెజార్టీ పెరుగుతూనే వస్తోంది.
ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగింది తప్ప ఈ ఎలివేషన్స్ ఇంపాక్ట్ ఏ మాత్రం కనిపించలేదంటున్నారు పొలిటికల్ పండిట్స్. 2019 ఎన్నికల్లో అసద్‌కు రెండు లక్షల 82వేల 187 ఓట్ల మెజార్టీతో 58.9 శాతం ఓట్లురాగా… ఈసారి ఆ మెజార్టీ మూడు లక్షల 38వేల 87 ఓట్లకు ఎగబాకింది. అలాగే ఓట్ షేర్ కూడా 61.8కి పెరిగింది. మరి హైదరాబాద్ ఎంపీ సీట్లో ఏదో జరిగిపోతోందని ఎన్నికలకు ముందు ఇచ్చిందంతా బిల్డప్పేనా? అంతా సోషల్ మీడియా సెన్సేషనేనా అంటే… ఎనీ డౌట్ అన్నది పొలిటికల్ పండిట్స్ క్వశ్చన్. అసదుద్దీన్‌కు ఆరు లక్షల 61వేల 981 ఓట్లు పోలైతే… ఆయనతో ఢీ అంటే ఢీ అన్నానని చెబుతున్న మాధవీలతకు మూడు లక్షల 23వేల 894 ఓట్లు మాత్రమే వచ్చాయి. పరిస్థితి అలా ఎందుకు మారిందంటే… బీజేపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
మాధవీలత ఓవర్ ఎలివేషన్స్ తెలంగాణ బీజేపీలోని చాలా మంది నాయకులకు నచ్చలేదని, అందుకే వాళ్ళు హైదరాబాద్ విషయంలో పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. అలాగే… హైదరాబాద్ ఎంపీ సీటు పరిధిలో కీలకమైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అస్సలు ఇన్వాల్వ్ అవలేదు. ఆ ప్రభావం కూడా ఉంది. మరీ ఓవర్ కాకుండా అందర్నీ కలుపుకుని పోయి ఉంటే ఇక్కడ బీజేపీ ఓట్ షేర్ ఇంకా పెరిగి ఉండేది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌ని చూస్తే… సోషల్ మీడియా ఎలివేషన్స్‌తో ఓట్లు రాలవనీ… ఓటర్లకు నమ్మకం కలిగించగలిగితేనే… ఫలితం ఉంటుందని తేలింది.