Gannavaram Airport: హైదరాబాద్ విమానాలు గన్నవరం మళ్లింపు.. మూడు విమానాలు ల్యాండింగ్..
చండీఘర్ నుంచి ఒక విమానం, గోవా నుంచి మరో విమానం, తిరువనంతపురం నుంచి ఇంకో విమానం.. ఇలా మూడు విమానాలు హైదరాబాద్ రావాల్సి ఉంది.
Gannavaram Airport: హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు విమానాల్ని గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. షెడ్యూల్ ప్రకారం మూడు విమనాలు హైదరాబాద్ రావాల్సి ఉంది.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత.. కరోనా పరీక్షలు చేయనున్న వైద్యులు
చండీఘర్ నుంచి ఒక విమానం, గోవా నుంచి మరో విమానం, తిరువనంతపురం నుంచి ఇంకో విమానం.. ఇలా మూడు విమానాలు హైదరాబాద్ రావాల్సి ఉంది. విమానాలు హైదరాబాద్ చేరుకున్నాయి. కానీ, పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో పరిస్థితిని పైలట్లకు వివరించి, విమానాల్ని మరో చోటుకు తరలించాలని ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే.. ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు విమానాల్ని తరలించారు. దీంతో హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వాల్సిన విమానాల్ని గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
అయితే, విమానాల్లోని ప్రయాణికులు కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు. హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించిన తర్వాత విమానాల్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమచారం. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలోనూ పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.