Hyderabad Formula Race Scam: కేటీఆర్ చెబితే రూ.54 కోట్లు ఇచ్చా.. అర్వింద్ పై వేటు తప్పదా ?
తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ కోసం 54 కోట్ల రూపాయల జనం సొమ్మును ధారాదత్తం చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ నోటి మాటగా చెప్పగానే..... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా... వెనకా ముందు చూసుకోకుండా రిలీజ్ చేశారు సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్. మళ్ళీ BRS ప్రభుత్వమే వస్తుందన్న ధీమానో... మనల్ని అడిగేదెవడు అనే ధైర్యంతోనే అప్పనంగా కోట్ల రూపాయలు ఇచ్చేశారు.
తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ కోసం 54 కోట్ల రూపాయల జనం సొమ్మును ధారాదత్తం చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ నోటి మాటగా చెప్పగానే….. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా… వెనకా ముందు చూసుకోకుండా రిలీజ్ చేశారు సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్. మళ్ళీ BRS ప్రభుత్వమే వస్తుందన్న ధీమానో… మనల్ని అడిగేదెవడు అనే ధైర్యంతోనే అప్పనంగా కోట్ల రూపాయలు ఇచ్చేశారు. ఇదే విషయాన్ని CS మెమోకు రాత పూర్వకంగా సమాధానంలో ఒప్పుకున్నారు అర్వింద్ కుమార్. ఇంకా మొదలే పెట్టని రేస్ కోసం అడ్వాన్స్ గా కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చేయడం కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది.
సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్ మీద ప్రభుత్వం చర్యలకు సిద్దమవుతోంది. ఫార్ములా ఈ రేస్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ కు 54 కోట్ల రూపాయలను ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ సొమ్ము చెల్లించడంపై సీరియస్ గా ఉంది రేవంత్ సర్కార్. అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పగానే HMDA నుంచి కోట్ల రూపాయలను ముందస్తు చెల్లింపులు చేయడం వివాదస్పదమైంది. 54 కోట్ల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఇచ్చిన నోటీసుల్లోని 9 ప్రశ్నలకు అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు
గ్రీన్ కో సంస్థకు చెందినదే ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి CEOగా అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే… ఈ-రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ఏస్ నెక్ట్స్ జెన్ తెలిపింది. తమకు మొదటి ఏడాది నిర్వహణతో భారీగా నష్టం వచ్చిందనీ… అందుకే తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఏస్ నెక్ట్స్ సంస్థ సెకండ్ సీజన్ కు ప్రమోటర్ గా ఉండబోనని చెప్పినప్పటికీ… ఇప్పటి వరకూ ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోలేదన్నారు అర్వింద్ కుమార్. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో … HMDAని ఈ-రేస్ లో ప్రమోటర్ గా దించామనీ… 54 కోట్ల రూపాయలను చెల్లింపులు చేసినట్టు వివరణలో పేర్కొన్నారు. HMDA నుంచి డబ్బులను నేరుగా చెల్లించినందున… ఆర్థిక శాఖ, ప్రభుత్వ అనుమతి తీసుకోలేదన్నారు అర్వింద్ కుమార్. ఈ-ఫార్ములా రేస్ నిర్వహణలో ఎప్పటికప్పుడు కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే చెల్లింపులు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఎందుకు కోట్ల రూపాయలు ఇచ్చారన్నదానిపై ఆయన సమాధానం ఇవ్వలేదు. అలాగే ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా స్పెసిఫిక్ గా అర్వింద్ సూచించలేకపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ స్కామ్ బయటపడింది. అప్పట్లోనే ముఖ్యమంత్రి ఆఫీస్ కు రాసిన నోట్ లో ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరారు సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్. కానీ ఇప్పుడు సీఎస్ మెమోకు ఇచ్చిన వివరణలో మాత్రం లీగల్ యాక్షన్ ప్రస్తావన తీసుకురాకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ఈ ఈవెంట్ కి HMDA ప్రమోటర్ గా మారడం వెనుక తన సొంత ప్రమేయం ఏదీ లేదని…అప్పటి మంత్రి కేటీఆర్ అనుమతితోనే జరిగిందని మాత్రం అర్వింద్ కుమార్ తన లీగల్ నోటీల్లో తెలిపారు. 54 కోట్ల దుర్వినియోగానికి బాధ్యుడైన
సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందా… మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు పెడుతుందా అన్నది చూడాలి.