IPL : హైదరాబాద్ దే ఐపీఎల్.. సెంటిమెంట్ చెప్తోంది ఇదే..
ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ అంచనాకు మించి అదరగొట్టింది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో.. ఫైనల్‌కు రయ్‌న దూసుకుపోయింది. చెపాక్‌లో కోల్‌కతాతో జరిగే ఫైనల్ ఫైట్ కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ అంచనాకు మించి అదరగొట్టింది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో.. ఫైనల్‌కు రయ్‌న దూసుకుపోయింది. చెపాక్‌లో కోల్‌కతాతో జరిగే ఫైనల్ ఫైట్ కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి సన్‌రైజర్స్ కప్పును ముద్దాడాలని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను హైదరాబాద్ గెలవడం పక్కా అని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2009, 2016 సీజన్‌లో ట్రోఫీని ముద్దాడింది. హైదరాబాద్ పేరు ఐపీఎల్ స్టార్టింగ్‌లో డెక్కన్ ఛార్జర్స్. ఆ తర్వాత సన్‌రైజర్స్‌గా మారింది. 2009లో అప్పటి డెక్కన్ ఛార్జర్స్.. ఫైనల్‌లో బెంగళూరును ఓడించి మొదటిసారి విజేతగా నిలిచింది. అప్పుడు డెక్కన్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్‌లో మళ్లీ బెంగళూరును ఓడించి.. రెండోసారి కప్ ముద్దాడింది. అప్పుడు జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. రెండుసార్లు కప్ కొట్టినప్పుడు.. ఆస్ట్రేలియా ఆటగాళ్లే జట్టును నడిపించారు.
ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా ప్లేయరే హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ కమిన్స్.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి నాయకత్వంలో ఫైనల్‌కు చేరుకుంది సన్‌రైజర్స్. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కెప్టెన్‌లుగా ఉన్న టైంలో ఫైనల్‌కు చేరుకున్న రెండు సీజన్‌లలో.. హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఐతే ఈ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందని.. ముచ్చటగా మూడోసారి హైదరాబాద్.. కప్‌ను ముద్దాడడం ఖాయం అని.. హైదరాబాద్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలుపెట్టారు.