Hyderabad Metro: 59 రూపాయలకే సిటీ అంతా చుట్టేయొచ్చు.. హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్..
హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ ప్రకటించారు మెట్రో అధికారులు.

Hyderabad Metro has announced a special offer on August 15
ఈ ప్రత్యేక ఆఫర్‌ను మూడు రోజులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే మెట్రో స్టేషన్లలో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డులు అందుబాటులో ఉన్నాయ్. సెలవు రోజుల్లో 99తో రీఛార్జ్ చేయించుకుంటే ఆ రోజంతా హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఎన్ని సార్లైనా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అదే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును వాడుకుంటూ.. ఇప్పుడు కేవలం 59తోనే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 12, 13, 15 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని వాడుకుని అపరిమిత మెట్రో రైడ్‌లను ఆస్వాదించవచ్చని అధికారులు ప్రకటనలో తెలిపారు.
మెట్రో రైల్ ఇప్పటికే విద్యార్థులకు కూడా స్టూడెంట్ పాస్ ఆఫర్ ప్రకటించింది. అంతేగాక, మెట్రో రైల్ కోచ్ లనూ పెంచే అవకాశం ఉంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని మెట్రో రైల్ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరోనా సమయంలో మెట్రోలో ప్రయాణాలు లేకపోవడంతో నిర్వాహణ సంస్థకు కాస్త ఇబ్బందులు ఎదురైనా.. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడం.. లాస్ట్ సమ్మర్ నుంచి ప్రయాణికులు కూడా భారీగా పెరగడంతో.. మెట్రో స్టేషన్‌లు కళకళలాడుతున్నాయ్. కాసుల వర్షం కురుస్తోంది. చాలామంది మెట్రో ప్రయాణానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఐతే జనాలను మరింత ఆకట్టుకునేందుకు.. అధికారులు ఇప్పుడు మరో ఆఫర్ ప్రకటించారు.